IIIT మెరిట్ జాబితా నేడు విడుదల
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ
ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ), శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన దరఖాస్తుల మెరిట్ జాబితా నేడు విడుదల కానుంది.
మే 1 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరించారు. జులై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. గత విద్యా సంవత్సరంలో జులై 15 నుంచి తరగతులు ప్రారంభమైనా ఈ సారి 15 రోజుల ముందుగానే పీయూసీ-1 తరగతులు మొదలు పెడతారు. పాత విద్యార్థులకు జూన్ 29 నుంచే ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది.