Type Here to Get Search Results !

తల్లికి వందనం స్కీమ్.. జులై 22న ఖాతాల్లోకి రూ. 13,000! ముఖ్యమైన వివరాలు

0

 తల్లికి వందనం స్కీమ్.. జులై 22న ఖాతాల్లోకి రూ. 13,000! 


​ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "తల్లికి వందనం" పథకానికి సంబంధించిన G.O.Ms 15 & 16 అధికారిక మార్గదర్శకాలను విడుదల చేసింది! 


​ముఖ్యమైన వివరాలు:


  •  నికర నగదు: ఒక విద్యార్థికి రూ. 15,000 కాగా, పాఠశాలల నిర్వహణ కొరకు రూ. 2,000 మినహాయించి.. తల్లుల ఖాతాల్లో రూ. 13,000 నేరుగా జులై 22న జమ అవుతాయి.
  • పరిమితి లేదు: ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా, అర్హత ఉంటే ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.
  •  ఎవరికి వర్తిస్తుంది?: 1 నుండి 12వ తరగతి (ఇంటర్) వరకు ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్/కాలేజీ విద్యార్థులందరికీ లభిస్తుంది.
  •  కొత్త అడ్మిషన్లు: 1వ తరగతి మరియు జూనియర్ ఇంటర్ కొత్త అడ్మిషన్ల వారికి ఆగస్టు 30న నగదు విడుదల.


​⚠️ మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి! ఒకవేళ లేకపోతే జులై 22 నుండి ఆగస్టు 3 లోపు సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చు.





తల్లికి వందనం పథకం – అర్హత ప్రమాణాలు (Eligibility Criteria)

 1. కుటుంబ ఆదాయం: 

గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12,000 లోపు ఉండాలి.


2. రేషన్ కార్డు:

కుటుంబంలో కనీసం ఒకరి పేరుపై రైస్ కార్డు ఉండాలి.


3. భూమి పరిమితి:

  • మాగాణి భూమి 3 ఎకరాల లోపు, లేదా
  • మెట్ట భూమి 10 ఎకరాల లోపు, లేదా
  • రెండు కలిపి మొత్తం 10 ఎకరాల లోపు ఉండాలి.


 4. నాలుగు చక్రాల వాహనం:

కుటుంబంలో ఎవరి పేరుపైనా 4 చక్రాల వాహనం ఉంటే అర్హులు కారు. (టాక్సీ, ట్రాక్టర్, ఆటోలకు మినహాయింపు ఉంది.)


5. విద్యుత్ వినియోగం:

కుటుంబం నెలకు సగటున 300 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం ఉండాలి. (గత 12 నెలల సగటును పరిగణలోకి తీసుకుంటారు.)


6. మున్సిపల్ ఆస్తి:

1000 చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం గల మున్సిపల్ ఆస్తి ఉండకూడదు.


7. ప్రభుత్వ ఉద్యోగి / పెన్షనర్:

కుటుంబంలో ఎవరైనా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, PSU ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షన్ పొందేవారు అయితే అర్హులు కారు. (పారిశుద్ధ్య కార్మికులు, అంగన్‌వాడీ సిబ్బందికి మినహాయింపు ఉంది.)


8. ఆదాయ పన్ను:

కుటుంబంలో ఎవరైనా ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తే అర్హులు కారు.


9. కుటుంబ డేటాబేస్:

లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ కుటుంబ డేటాబేస్‌లో ఉండాలి. అవసరమైతే క్షేత్రస్థాయిలో ధృవీకరణ చేసి అర్హత నిర్ధారిస్తారు.


10. చదువుతున్న విద్యార్థులు:

విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్ (12వ తరగతి) వరకు ప్రభుత్వ, ఎయిడెడ్ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు/జూనియర్ కళాశాలల్లో చదువుతూ ఉండాలి. (ITI, పాలిటెక్నిక్, IIIT (RGUKT) తదితర కోర్సులు ఈ పథకానికి వర్తించవు.)


11. అనాథలు & వీధి బాలలు:

స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలల్లో చేరిన అనాథలు, వీధి బాలలు సంబంధిత శాఖ ధృవీకరణతో అర్హులు.


12. అనాథ పిల్లల బ్యాంకు ఖాతా:

బ్యాంకు ఖాతా లేని అర్హులైన అనాథ పిల్లలకు గార్డియన్ ఆధ్వర్యంలో మైనర్ బ్యాంకు ఖాతా తెరిపించి ఆర్థిక సహాయం జమ చేస్తారు.


13. ఆధార్ సీడింగ్:

తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ (NPCI Seeding) తప్పనిసరిగా పూర్తి అయి ఉండాలి.


14. కొత్త అడ్మిషన్లు:

1వ తరగతి మరియు 11వ తరగతి కొత్త ప్రవేశాలు పూర్తయ్యాక అదనపు అర్హులకూ ఆర్థిక సహాయం అందజేస్తారు.

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages