COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచన..
ÇOVID-19 Cases: ఏపీలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. జూన్ 26 నుంచి12 కొవిడ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కడప,గుంటూరు, కాకినాడ జిల్లాల్లో కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కొవిడ్ పాజిట్‌తో నలుగురు మృతి చెందారు. హోమ్ ఐసోలేషన్‌లో ముగ్గురు బాధితులున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మళ్లీ కోవిడ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
అయితే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కోవిడ్-19 కేసులు బయటపడటంతో, కరోనావైరస్ తిరిగి రావడం, మళ్లీ లాక్‌డౌన్ గురించి గుర్తు చేసుకుంటున్నారు. మరోసారి 2020 నాటి తీవ్రమైన పరిస్థితి వైపు వెళ్తున్నామా అనే ఆందోళనను ప్రజలలో మళ్లీ టెన్షన్ పెట్టిస్తోంది. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు, వైద్యుల, ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.