Type Here to Get Search Results !

AP 4th Class Telugu Textbook Solutions – 5. సత్య మహిమ (2026-27)

0
5 సత్యమహిమ
సాధనపత్రం 1
చదవడం - వ్యక్తపరచడం
అ) కింది పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
  • 1. చేసిన తప్పు తెలుసుకొని, దానిని మనం సరిదిద్దుకోవాలి. పై వాక్యంలో గీత గీసిన పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించండి.
    అ) మంచి
    ఆ) ఒప్పు
    ఇ) న్యాయం
    ఈ) ఆనందం
    Answer: ఆ) ఒప్పు
  • 2. ఉంగరం దొరికినపుడు వీరయ్యకు వచ్చిన ఆలోచన ఏమిటి?
    జ: మొదట ఆ ఉంగరాన్ని తీసుకోవాలనుకున్నాడు, కానీ అలా చేయడం తప్పు అని భావించి తన యజమానికి అప్పగించాడు.
  • 3. మీరే వీరయ్య అయితే ఏం చేస్తారు?
    జ: నేనే వీరయ్య అయితే ఏమాత్రం ఆశపడకుండా ఆ బంగారు ఉంగరాన్ని నిజాయితీగా యజమానికే అప్పగిస్తాను.
  • 4. వీరయ్య ఎక్కడ పనిచేసేవాడు?
    జ: వీరయ్య ఒక వ్యాపారి వద్ద దుకాణంలో పనిచేసేవాడు.
  • 5. మీరే యజమాని అయితే ఏం చేస్తారు?
    జ: నేనే యజమాని అయితే వీరయ్య చూపిన నిజాయితీని మెచ్చుకొని అతనికి మంచి బహుమతిని, ప్రశంసను అందిస్తాను.
ఆ) కింది గేయపాదాలను సరిచేసి రాయండి.
  • సరిచేసిన గేయ పాదాలు:
    చూపి నీదేనేమో
    చూడుమా యని పలికె
    మిరుమిట్లు గొలుపుచు
    మెరిసెడి గొడ్డలి
    తిలకించి యతడనె
    తల చేతులాడించి
    అది నాది కాదమ్మా!
    అది నాది కాదు
సాధనపత్రం 2
చదవడం - వ్యక్తపరచడం
అ) కింది పేరాలోని ఖాళీలను ఇచ్చిన పదాలు ఉపయోగించి పూరించండి.
  • ప్రశాంత్ వాళ్ళ గోడపై ఒక పిచ్చుక దాహం తో అరుస్తున్నది. ప్రశాంత్ దానికి ఒక గిన్నెలో నీళ్ళు పెట్టాడు. ఆ పిచ్చుక నీళ్ళు తాగి ఎగిరిపోయింది. ప్రశాంత్ ఆనందించాడు. ప్రశాంత్ వాళ్ళ అమ్మ, అతడిని మెచ్చుకుంది.
ఆ) కింది గేయాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
  • 1. వసంతకాలం గురించి ఒక వాక్యాన్ని రాయండి.
    జ: వసంతకాలం ప్రకృతికి అందమైన పచ్చదనాన్ని, కొత్త చిగుళ్లను తెస్తుంది.
  • 2. ఇంద్రధనస్సు ఎప్పుడు కనిపిస్తుంది?
    జ: వర్షం పడి తగ్గినప్పుడు ఆకాశంలో సూర్యునికి ఎదురుగా ఇంద్రధనస్సు కనిపిస్తుంది.
  • 3. చందమామ వెన్నెల ఇస్తుంది కదా! మీరు ఎప్పుడైనా వెన్నెల్లో ఆడుకున్నారా? ఏయే ఆటలు ఆడారు?
    జ: అవును, ఆడుకున్నాము. వెన్నెల్లో దాగుడుమూతలు, అంత్యాక్షరి, చందమామ ఆటలు ఆడాము.
  • 4. సాయంత్ర వేళ వాతావరణం ఎలా ఉంటుంది?
    జ: సాయంత్ర వేళ సూర్యుడు అస్తమించి చల్లని గాలితో ఆహ్లాదకరంగా, చల్లదనంతో ఉంటుంది.
సాధనపత్రం 3
పదజాలం
1) పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి. గడులలో రాయండి.
  • సరళాక్షరాలు:
    ఎ, ల, త, న, ద, చ, ప, వ, ర, క
  • పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి: ఉదా: ఎలుక
    లత, తల, నగ, దండ, చదరంగం, పలక, వల, రమ, కడవ
  • సొంత వాక్యం:
    పిల్లలు పలక మీద అందంగా అక్షరాలు రాస్తున్నారు.
2. పేరాలోని గుణింత అక్షరాలను గుర్తించండి. గడులలో రాయండి.
  • గుణింత అక్షరాలు:
    కౌ, ను, గో, తి, చే, దూ, రో, భా, పా
  • పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి: ఉదా: కౌరవులు
    నువ్వులు, గోడ, తీపి, చేను, దూడ, రోలు, భారతము, పాట
  • సొంత వాక్యం:
    మా ఊరి చివర అందమైన పచ్చని చేను ఉంది.
3. పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి. గడులలో రాయండి.
  • ద్విత్వాక్షరాలు:
    ళ్ళు, త్తి, ళ్ళొ, గ్గా, వ్వొ, న్నా, బ్బ, క్క, ళ్ళ
  • పై అక్షరాలు ఉండేలా పదాలు రాయండి: ఉదా: గవ్వ
    ముళ్ళు, కత్తి, గుగ్గిలం, రవ్వ, నాన్న, దెబ్బ, అక్క, బడిపిల్లలు
  • సొంత వాక్యం:
    తోటమాలి చెట్ల కొమ్మలను కత్తితో కత్తిరించాడు.
4. పై పేరాలోని సంయుక్తాక్షర పదాలను రాయండి. వాటితో సొంత వాక్యాలను రాయండి.
  • సంయుక్తాక్షర పదాలు: కౌషిక్, తన్వీష్, సంభాషణ, ఉపాధ్యాయుడు, ఆరోగ్యం, కార్యక్రమం, ప్రభుత్వం
    1. ఆరోగ్యం: పరిశుభ్రత పాటించడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది.
    2. ఉపాధ్యాయుడు: ఉపాధ్యాయుడు విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పిస్తాడు.
    3. ప్రభుత్వం: ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది.
సాధనపత్రం 4
పదజాలం
అ) కింది పదాలను ఉపయోగించి ఖాళీలను పూరించండి.
  • ఉదా: కాకి రంగు = నలుపు
  • 1. పండు మిరప = ఎరుపు
  • 2. నిమ్మ పండు = పసుపు
  • 3. పాల రంగు = తెలుపు
  • 4. పంట పొలాలు = ఆకుపచ్చ
ఆ) కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
  • 1. 'బహుమానం' అనే పదానికి అర్థాన్ని గుర్తించండి.
    అ) అందం
    ఆ) కానుక
    ఇ) బంగారం
    ఈ) పొగడ్త
    Answer: ఆ) కానుక
  • 2. అబద్దం చెప్పడం చెడ్డ అలవాటు. (గీత గీసిన పదానికి వ్యతిరేక పదం రాసి, వాక్యం రాయండి)
    వ్యతిరేక పదం: నిజం (సత్యం)
    వాక్యం: ఎల్లప్పుడూ నిజం చెప్పడం మంచి అలవాటు.
ఇ) కొన్ని జంటపదాలను రాసి, ఆ పదాలతో సొంత వాక్యాలను రాయండి.
జంటపదం Ans (సొంతవాక్యం)
1. కల్లాకపటం సంతోష్ తన స్నేహితులతో కల్లాకపటం లేకుండా నిజాయితీగా ఉంటాడు.
2. రాకపోకలు పండుగ వేళ బస్టాండ్‌లో ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి.
3. ఆటపాటలు పిల్లలు బడిలో ఆటపాటలతో ఎంతో ఉల్లాసంగా గడుపుతారు.
4. సిరిసంపదలు కష్టపడి పనిచేసేవారి ఇంట సిరిసంపదలు తులతూగుతాయి.
ఈ) ఇచ్చిన ఆధారాలతో గడులను నింపండి.
  • అడ్డం: 1. పంటలు పండించేవాడు = రైతు
    అడ్డం: 2. నీళ్ళను దీని నుండి తోడుతారు = బావి
    నిలువు: 1. గాలి, వాన ఎక్కువైతే = తుఫాను
సాధనపత్రం 5
స్వీయరచన
కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
  • 1. నదీ దేవత పేదవాడితో ఏమని పలికింది?
    జ: "అన్నా! కరుణతో పిలిచి, ఈ బంగారు, వెండి, ఇనుప గొడ్డళ్లను చూపిస్తూ ఇది నీదేనేమో చూడు" అని పలికింది.
  • 2. పేదవానికి నదీ దేవత బహుమతిగా ఏమిచ్చింది?
    జ: పేదవాని సత్యసంధతకు మెచ్చి అతని ఇనుప గొడ్డలితో పాటు బంగారు గొడ్డలిని, వెండి గొడ్డలిని బహుమతిగా ఇచ్చింది.
  • 3. పేదవాడు ఎలాంటి వాడు? నాలుగు వాక్యాలు రాయండి.
    జ: 1. పేదవాడు మచ్చలేని మంచి ప్రవర్తన కలవాడు.
    2. కట్టెలు కొట్టుకొని రోజూ నిజాయితీగా జీవించేవాడు.
    3. ఎల్లప్పుడూ సత్యాన్నే పలికే సత్యవ్రతుడు.
    4. పరాయి సొమ్ముకు ఏనాడూ ఆశపడని నిస్వార్థపరుడు.
  • 4. పేదవాడు ఎందుకు బాధపడ్డాడు?
    జ: చెట్టు కొడుతుండగా చేతిలో ఉన్న ఒకే ఒక్క గొడ్డలి నీటిలో పడిపోయింది. గొడ్డలి లేకపోతే కట్టెలు కొట్టలేడు, పిల్లలకు గంజి పోయలేనని తీవ్రంగా బాధపడ్డాడు.
  • 5. గేయం ఆధారంగా 'సత్య మహిమ' కథను సొంత మాటలలో రాయండి.
    జ: ఒక ఊరిలో కట్టెలు కొట్టి జీవించే నిజాయితీపరుడైన పేదవాడు ఉండేవాడు. ఒకరోజు నది ఒడ్డున చెట్టు కొడుతుండగా గొడ్డలి నీటిలో పడిపోయింది. అతడు ఏడుస్తుండగా నదీదేవత వచ్చి మొదట బంగారు, తర్వాత వెండి గొడ్డళ్లను చూపించింది. అతడు అవి నావి కావని నిరాకరించి, ఇనుప గొడ్డలి చూపినప్పుడు మాత్రమే నాదని ఒప్పుకున్నాడు. అతని సత్యానికి మెచ్చిన దేవత మూడు గొడ్డళ్లనూ బహుమతిగా ఇచ్చి ఆశీర్వదించింది.
  • 6. పేదవాని స్థానంలో నీవు ఉంటే నదీ దేవత వద్ద ఏమి కోరుకుంటావు? ఎందుకు?
    జ: పేదవాని స్థానంలో నేనుంటే నా సొంత ఇనుప గొడ్డలినే కోరుకుంటాను. ఎందుకంటే కష్టపడి సంపాదించేదే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది, ఇతరుల సొమ్మును ఆశించడం పాపం.
సాధనపత్రం 6
భాషాంశాలు
అ) కింది వాక్యాలు చదవండి. క్రియా పదాలను సరైన పట్టికలో రాయండి.
జరిగిన పని (భూతకాలం) జరుగుతున్న పని (వర్తమానకాలం) జరుగబోయే పని (భవిష్యత్ కాలం)
తెచ్చాడు (4) ఆడుతున్నాడు (1) వెళ్తాను (3)
వచ్చారు (6) పాడుతున్నది (2) జరుగుతాయి (5)
చేసింది (7) చేస్తున్నది (9) జరుగుతుంది (8)
ఆ) కింది వాక్యాలలో క్రియాపదాల కింద గీత గీసి, వాటిని ఉపయోగించి కొత్తవాక్యాలు రాయండి.
  • 1. పిల్లలు ఆటలు ఆడుతున్నారు. → బాలురు మైదానంలో ఫుట్‌బాల్ ఆడుతున్నారు.
  • 2. అమ్మ వంట చేస్తుంది. → అక్క ఇంటి పని చేస్తుంది.
  • 3. నాన్న బహుమతులు తెచ్చాడు. → మామయ్య మా కోసం మిఠాయిలు తెచ్చాడు.
  • 4. రజనీ పాట పాడింది. → లత ప్రార్థనా గీతం పాడింది.
  • 5. ఈ రోజు నేను ఇడ్లీలు తిన్నాను. → సాయంత్రం నేను పండ్లను తిన్నాను.
సాధనపత్రం 7
భాషాంశాలు
అ) కింది పేరాలో క్రియాపదాలకు గీత గీయండి.
  • వంశీ అన్నం తిని, బడికి బయలుదేరాడు. దారిలో మనోహర్‌ను కలిశాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ, బడికి చేరారు. బడిలో పాఠాలు విన్నారు. స్వర్ణ దగ్గరున్న కథల పుస్తకం వంశీ అడిగాడు. వంశీ, స్వర్ణ, మనోహర్ కలిసి 'బంగారు బాతు కథ' చదివారు. బడి గంట కొట్టగానే, ఇంటికి వెళ్ళిపోయారు.
ఆ) కింది ప్రశ్నలకు సరైన జవాబులు రాయండి.
  • 1. కింది వాక్యంలో క్రియా పదాలను గుర్తించండి: "సీత, రామునితో కలిసి అడవికి వెళ్ళింది."
    అ) అడవికి
    ఆ) సీత
    ఇ) వెళ్ళింది
    ఈ) రాముడు
    Answer: ఇ) వెళ్ళింది
  • 2. కింది వాక్యాలలో సరైన క్రియా పదాన్ని పూరించండి.
    అ) గణేష్ పాఠం చదివాడు. (చదివాడు / ఆడాడు)
    ఆ) నాన్న నిన్న ఢిల్లీ వెళ్ళాడు. (వస్తాడు / వెళ్ళాడు)
    ఇ) మామయ్య ఊరి నుండి వచ్చాడు. (వచ్చింది / వచ్చాడు)
    ఈ) అరుణ పూలు అల్లింది. (చేసింది / అల్లింది)
  • 3. కింది వాక్యంలో క్రియా పదాన్ని సరిచేసి రాయండి: "వైష్ణవి నాట్యం చేశాడు."
    జ: వైష్ణవి నాట్యం చేసింది.
ఇ) కింద ఇచ్చిన క్రియాపదాలను సరైన ఖాళీలలో పూరించండి. (కోసింది, పండింది, తినింది, చూసింది)
  • 1. చెట్టు మీద పండు పండింది.
  • 2. వర్షిణి పండు చూసింది.
  • 3. చెట్టెక్కి పండు కోసింది.
  • 4. కోసుకుని పండు తినింది.
సాధనపత్రం 8
సృజనాత్మకత
అ) గేయాన్ని పొడిగించి రాయండి.
  • అందాల... జాబిల్లి
    అన్నం తినవే నా తల్లి
    మామయ్య వస్తాడు
    బూరెలు ఎన్నో తెస్తాడు
    అత్తమ్మ వస్తుంది
    లడ్డూలు ఎన్నో తెస్తుంది
    తాతయ్య వస్తాడు
    బొమ్మలు ఎన్నో తెస్తాడు
    అమ్మమ్మ వస్తుంది
    కథలు ఎన్నో చెబుతుంది
ఆ) చుక్కలు కలిపి చిత్రాన్ని గీసి, రంగులు వేయండి. దానికి పేరు పెట్టండి. కొన్ని వాక్యాలు రాయండి.
  • చిత్రం పేరు: సైకిల్ తొక్కుతున్న కోతి
    1. కోతి వీపున బ్యాగు వేసుకొని సరదాగా సైకిల్ తొక్కుతున్నది.
    2. అది బడికి వెళ్తున్నట్లు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నది.
    3. కోతి ముఖంలో చిరునవ్వు ఎంతో ముద్దుగా ఉంది.
సాధనపత్రం 9
నేనేమి నేర్చుకున్నాను?
కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
  • 1. "తిలకించి యతడనె తల చేతులాడించి" ఈ వాక్యంలో గీత గీసిన భాగానికి అర్థాన్ని గుర్తించండి.
    అ) అడిగి
    ఆ) చూసి
    ఇ) చదివి
    ఈ) అరచి
    Answer: ఆ) చూసి
  • 2. కింది వాక్యంలో గీత గీసిన పదాన్ని ఉపయోగించి సొంతవాక్యం రాయండి: "నదీ దేవత పేదవాడి నిజాయితీని మెచ్చుకుంది."
    సొంతవాక్యం: విద్యార్థులు ఎల్లప్పుడూ నిజాయితీని అలవర్చుకోవాలి.
  • 3. గేయంలో అనేక ప్రాసపదాలు ఉన్నాయి కదా. అవి కాకుండా మరికొన్ని ప్రాసపదాలను రాయండి.
    జ: 1. గలగల - కిలకిల
    2. వాన - పూన
    3. పంట - జంట
    4. మాట - పాట
  • 4. కింది పేరా ఆధారంగా ప్రశ్నలకు రాయండి.
    i. పేరాలోని కూరగాయలు, పండ్ల పేర్లను రాయండి.
    కూరగాయలు : బెండకాయలు, వంకాయలు, కాకరకాయలు
    పండ్లు : ఆపిల్, బత్తాయి, సపోట, ద్రాక్ష
  • ii. సాహితి బజారుకు వెళ్ళినప్పుడు కూరగాయలు, పండ్లు కొనింది కదా! మీరైతే ఏయే పండ్లు కొంటారు?
    జ: నేనైతే మామిడి పండ్లు, అరటి పండ్లు, దానిమ్మ పండ్లు, జామ పండ్లు కొంటాను.
  • 5. పాఠం ఆధారంగా ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం వల్ల కలిగే లాభాలు గురించి కొన్ని వాక్యాలు రాయండి.
    జ: ఎల్లప్పుడూ సత్యం మాట్లాడటం వల్ల సమాజంలో గౌరవం, ఆదరణ లభిస్తాయి. మనపై అందరికీ నమ్మకం పెరుగుతుంది, ఆపదలు రాకుండా మనశ్శాంతి లభిస్తుంది.
  • 6. పాఠంలోని బీదవాడు ఒకవేళ 'బంగారు గొడ్డలి నాదే' అని చెప్పి ఉంటే, నదీదేవత ఏ విధంగా స్పందించి ఉండేదో ఊహించి రాయండి.
    జ: అతడు అసత్యం పలికినందుకు దేవత ఆగ్రహించి, బంగారు గొడ్డలితో పాటు అతని అసలైన ఇనుప గొడ్డలిని కూడా ఇవ్వకుండా మాయమైపోయేది. అతడు దురాశతో ఉన్నదానిని కూడా కోల్పోయేవాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages