Thenela Thetala Matalatho Song Lyrics In Telugu
తేనెల తేటల మాటలతో…
మన దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకుని…
ఇక జీవన యానం చేయుదమా
తేనెల తేటల మాటలతో…
మన దేశమాతనే కొలిచెదమా
సాగర మేఖల చుట్టుకుని…
సురగంగ చీరగా మలచుకుని
సాగర మేఖల చుట్టుకుని…
సురగంగ చీరగా మలచుకుని
గీతాగానం పాడుకుని…
గీతాగానం పాడుకుని, మన దేవికి ఇవ్వాలి హారతులు
తేనెల తేటల మాటలతో…
మన దేశమాతనే కొలిచెదమా
గాంగజఠాధర భావనతో…
హిమశైల రూపమే నిలబడగా
గాంగజఠాధర భావనతో…
హిమశైల రూపమే నిలబడగా
గలగల పారే నదులన్నీ…
గలగల పారే నదులన్నీ…
ఒక బృంద గానమే చేస్తుంటే
తేనెల తేటల మాటలతో…
మన దేశమాతనే కొలిచెదమా
ఎందరో వీరుల త్యాగఫలం…
మన నేటి స్వేచ్ఛకే మూల భలం
ఎందరో వీరుల త్యాగఫలం…
మన నేటి స్వేచ్ఛకే మూల భలం
వారందరినీ తలచుకుని…
వారందరినీ తలచుకుని…
మన మానస వీధిని నిలపుకొని
తేనెల తేటల మాటలతో…
మన దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకుని…
ఇక జీవన యానం చేయుదమా
తేనెల తేటల మాటలతో…
మన దేశమాతనే కొలిచెదమా