ఆకాశము లో ఎంతోఎత్తున ఎగురుతున్న గద్ద ... కింద ఎక్కడో కదులుతున్న ఎలుక , పాము లను పసిగట్టి ఒక్కసారిగా దిగివచ్చి పట్టుకుంటాయి. రాబందులు కూడా ఆకాశము నుండే ఎక్కడో ఉన్న కళేబరాలను గుర్తిస్తాయి.
పక్షులది తీవ్రమైన కంటిచూపి. కంటినిర్మాణము లో కంటిబాగాలకు అధిక శక్తి నందించేందుకు టెలిస్కోపిక్ లాంటి దువ్వెన రూపములో ఉండే ఒక ప్రత్యేక నిర్మాణము ఉంటుంది. వీటి ఫలితముగా కంటిచూపును సవరించుకోవడము , ఆహారపు వస్తువులను జాగ్రత్తగా ఫోకస్ చేసుకోవడము సాధ్యమవుతుంది.ఎంతో ఎత్తున ఉన్నందున ఎక్కువ విస్తీర్ణము మీద పక్షులు కన్నేసి ఉంచగలవు .