ఎవరు రాసినారో తెలియదుగానీ
చదివితే మాత్రం పిచ్చెక్కించేస్తోంది.
No more words..
🌲అడవిలో ఎన్నికలొచ్చాయి.🎄
అన్ని చెట్లకు ఓటు హక్కు కల్పించారు.
సెలయేరు గొడ్డలి పోటీ పడ్డాయి.
పోలింగ్ జరిగింది.
చెట్లకు జీవనాధారమైన నీరు ఇచ్చే సెలయేరు గెలుస్తుందని అందరూ విశ్లేషకులు అనుకున్నారు.
నిత్యం వృక్షాలను తెగనరికే గొడ్డలి చిత్తుచిత్తుగా ఓడిపోతుందని సర్వే ఫలితాలు ముందే చెప్పాయి.
సెలయేటిపై గొడ్డలి భారీ మెజారిటీతో గెలిచింది.
ఆశ్చర్యపోయారు అందరూ...!!!
ఈ విషయమే వివిధ వృక్షజాతుల నాయకులను అడిగారు.
అవును...నిజమే.....
గొడ్డలి వలనే మా జాతి అంతరిస్తుంది...
కానీ...
ఆ గొడ్డలి వెనుక వున్న కర్ర మా కులానికి చెందినది.
అందుకే...ఓటేశాం...!
-ఎవరు రాసారో తెలీదుగానీ.... బుర్ర తిరిగిపోయింది🤒