సాధనపత్రం 1 - చదవడం – వ్యక్తపరచడం (పేజీ 22)
-
అ) కింది కథను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.విజయ్, కార్తీక్ మంచి స్నేహితులు. వీళ్ళు వస్తే బడిలో పిల్లలందరూ వీరి చుట్టూ చేరేవారు. వీళ్ళు తినుబండారాలు తెచ్చుకున్నా, స్నేహితులందరినీ పిలిచి, పంచుకుని తినేవాళ్ళు. ఒకరోజు పిల్లలంతా విజయ్, కార్తీక్ దగ్గరకు పోయి, "అందరితో కలిసి పంచుకుని తినే మంచి అలవాటు మీకెలా వచ్చింది?" అని అడిగారు. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో పిల్లలంతా కలిసి ఒకచోట కూర్చున్నారు. విజయ్, కార్తీక్ అక్కడకు చేరిన మూడు కాకులను చూపించారు. ఆ కాకులు కావ్ ... కావ్ ... అంటూ అన్ని కాకులను పిలిచాయి. పిల్లలు వదిలిన అన్నం మెతుకులు కలిసి తినసాగేయి. అందరితో కలిసి పంచుకుని తినడం మేం కాకుల నుండే నేర్చుకున్నామని చెప్పారు. నేర్చుకోవాలే గానీ, ప్రకృతి మనకు చాలా నేర్పుతుంది.1. ఆహారం దొరికినప్పుడు కాకులు ఏం చేసేవి?జ: ఆహారం దొరికినప్పుడు కాకులు 'కావ్... కావ్...' అంటూ అరిచి, మిగిలిన అన్ని కాకులను పిలిచి కలిసి పంచుకుని తినేవి.2. విజయ్, కార్తీక్‌లకు ఉన్న మంచి అలవాటు ఏమిటి?జ: తాము తెచ్చుకున్న తినుబండారాలను స్నేహితులందరితో కలిసి పంచుకుని తినడం విజయ్, కార్తీక్‌లకు ఉన్న మంచి అలవాటు.3. ఈ కథకు పేరు పెట్టండి?జ: "పంచుకుని తిందాం" లేదా "ప్రకృతి నేర్పిన పాఠం".4. విజయ్, కార్తీక్‌లకు ఉన్న మంచి అలవాట్లు గురించి చదివారు కదా! మీరు నేర్చుకున్న మంచి అలవాట్లను రాయండి.జ:
1. నా వస్తువులను, ఆహారాన్ని మిత్రులతో పంచుకోవడం.
2. పెద్దలను గౌరవించడం మరియు అందరితో మర్యాదగా మాట్లాడటం.
3. సహాయం కావాల్సిన వారికి నాకు తోచిన సహాయం చేయడం. -
ఆ) ఈ కింది పేరా చదివి ప్రశ్నలు తయారు చేయండి.దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. ఆ ఎత్తుమీద నుంచి చూస్తే ఎటుచూసినా ప్రకృతి సౌందర్యమే కనిపిస్తోంది. ఈ నేల ఇంత అందంగా ఉంది అనుకుంటే ఆకాశం మరింత అందంగా ఉంటుంది. ఆకాశం ఆ ఎత్తునుండి చూస్తే అత్యద్భుతంగా కనిపించింది. ఒకమూల ఏ మార్పూ లేకుండా వట్టి నీలంగా ఉంది. ఇంకోమూల పింజెమబ్బులు ఒకదానిమీద ఒకటి పడి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. తూర్పుకు తిరిగితే నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయి.తయారు చేసిన ప్రశ్నలు:1. దూరాన ఉన్న ఇళ్ళు దేనిలా ఉన్నాయి?2. ఎత్తు మీద నుండి చూస్తే ఏ ఏ అందాలు కనిపించాయి?3. పింజెమబ్బులు ఎలా విన్యాసాలు చేస్తున్నాయి?4. తూర్పు వైపు తిరిగినప్పుడు ఏమి కనిపించాయి?
www.meebadi.in
సాధనపత్రం 2 - చదవడం – వ్యక్తపరచడం (పేజీ 23)
-
అ) కింది పేరాను చదవండి. ఇచ్చిన పదాలను సరైన చోట రాయండి.పదాలు: ( పీచుమిఠాయి - జాతర - చెరుకురసం - సాయంత్రం - గాజులు )ఆనంద్, జయ అన్నాచెల్లెళ్ళు. గ్రామంలో జరుగుతున్న జాతరకు వెళ్ళారు. జాతర చాలా సందడిగా ఉంది. అక్కడ బొమ్మల దుకాణాలు, మిఠాయి దుకాణాలు, గాజులు, బొట్టు బిల్లాలు, గొలుసులు అమ్మే దుకాణాలు చాలా ఉన్నాయి. అందులో గల ఒక దుకాణంలో జయకు గాజులు కొన్నాడు. తనకు రంగురంగుల బెలూన్లు, బొమ్మలు కొనుక్కున్నాడు. ఇద్దరూ కలిసి పీచుమిఠాయి తిన్నారు. వారి దగ్గరలోనే చెరుకురసం దుకాణం కనిపించింది. చెరుకురసం తాగుదాం అని జయ అడిగింది. సరే తాగుదాం అని ఇద్దరు చెరో గ్లాసు తాగారు. జాతరలో ఉన్న అన్నింటినీ చూసి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు.
-
ఆ) విజయ్ తన డైరీలో ఆదివారం విశాఖపట్నంలో చూసిన విశేషాలు రాసుకున్నాడు. వాక్యాలు తారుమారయ్యాయి. తారుమారైన వాక్యాలను వరుస క్రమంలో పేరాగా రాయండి.తారుమారైన వాక్యాలు:
• చివరగా కైలాసగిరి వెళ్ళి పై నుంచి నగరాన్ని చూశాను.
• తరువాత సబ్‌మెరీన్, మ్యూజియం చూశాను.
• నేను ఈరోజు విశాఖపట్నం వెళ్ళాను.
• ఈ రోజు నాకు చాలా ఆనందంగా గడిచింది.
• ఉదయం బీచ్‌కు వెళ్ళి సముద్రపు అలలు, చల్లని గాలిని ఆస్వాదించాను.
• అది చాలా ఆసక్తికరంగా ఉంది.
• ఆ తర్వాత హార్బర్ (ఓడరేవు)కి వెళ్ళాను.
• ఈ రోజు నేను ఎన్నో కొత్త ప్రదేశాలు చూశాను.వరుస క్రమంలో సరిచేసిన పేరా:నేను ఈరోజు విశాఖపట్నం వెళ్ళాను. ఉదయం బీచ్‌కు వెళ్ళి సముద్రపు అలలు, చల్లని గాలిని ఆస్వాదించాను. ఆ తర్వాత హార్బర్ (ఓడరేవు)కి వెళ్ళాను. తరువాత సబ్‌మెరీన్, మ్యూజియం చూశాను. అది చాలా ఆసక్తికరంగా ఉంది. చివరగా కైలాసగిరి వెళ్ళి పై నుంచి నగరాన్ని చూశాను. ఈ రోజు నేను ఎన్నో కొత్త ప్రదేశాలు చూశాను. ఈ రోజు నాకు చాలా ఆనందంగా గడిచింది.
www.meebadi.in
సాధనపత్రం 3 - పదజాలం (పేజీ 24)
-
పేరాను చదవండి. అభ్యసాలు చేయండి.హిమాలయాలు చూడటానికి ఎంతో బావుంటాయి. అక్కడ ఎక్కడ చూసినా మంచు, మేఘాలు, ఎత్తైన పర్వతాలు చాలా అందంగా కనిపిస్తాయి. పర్వతాల మధ్యలో జలపాతాలు, నదులు సప్పుడులతో ప్రవహిస్తున్నాయి. పచ్చని తోటలు, అడవులు, రకరకాల పక్షుల పాటలు వింటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సూర్యోదయం చూడటం ఒక అద్భుత అనుభవం. హిమాలయాల ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంటే ఎవరి మనసు అయినా ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది.
-
1) పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి. గడులలో రాయండి.అక్షరాలు: అ ఎ క ప జ ల వ డ మ రపై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి:
అలసట | ఎండ | కలప | పడవ | జలజ | లతసొంత వాక్యం:
జ: మేము సెలవుల్లో పడవ ప్రయాణం చేశాము. -
2) పేరాలోని గుణింతాక్షరాలను గుర్తించండి. గడులలో రాయండి.అక్షరాలు: చూ తో బా మే పా సూ కా విపై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి:
చూడటం | తోటలు | బావుంటాయి | మేఘాలు | పాటలు | సూర్యోదయంసొంత వాక్యం:
జ: మా ఇంటి ఆవరణలో అందమైన తోటలు ఉన్నాయి. -
3) పై పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి. గడులలో రాయండి.అక్షరాలు: క్క ప్పు చ్చ క్షు స్సపై అక్షరాలు ఉండేలా పదాలు రాయండి:
అక్కడ | సప్పుడులతో | పచ్చని | పక్షుల | మనస్సుసొంత వాక్యం:
జ: వానకాలంలో పొలాలు పచ్చని రంగుతో కలకలలాడుతాయి. -
4) పై పేరాలోని సంయుక్తాక్షర పదాలను రాయండి. వాటితో వాక్యాలను రాయండి.1. పదం: పర్వతాలు
వాక్యం: హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి.
2. పదం: ప్రశాంతంగా
వాక్యం: ఉదయం వేళ దైవ ప్రార్థన చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
www.meebadi.in
సాధనపత్రం 4 - పదజాలం (పేజీ 25)
-
అ) కింది గళ్ళలో అడవికి సంబంధించిన పదాలు రాయండి.
కుం ప క్షణ లు గ కు న చె అ జం ళ్ళు నె ట్లు త తు తే నె న పూ వు బి ళ్ళ రా స లు ఉదా : చెట్లు
1. జంతువులు
2. పక్షులు
3. తేనెపట్టు
4. పూవులు
5. కుందేళ్ళు -
ఆ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి, ఆ అర్థంతో వాక్యాన్ని రాయండి.ఉదా॥ ఆకాశంలో మేఘాలు గబగబా కదులుతున్నాయి.
గబగబా : వేగంగా
వాక్యం: ఆకాశంలో మేఘాలు వేగంగా కదులుతున్నాయి.1) విరబూసిన మల్లెపూలు చూడచక్కగా ఉన్నాయి.
చూడచక్కగా : అందంగా
వాక్యం: విరబూసిన మల్లెపూలు అందంగా ఉన్నాయి.
2) పుట్టలలో సర్పాలు నివసిస్తాయి.
సర్పాలు : పాములు
వాక్యం: పుట్టలలో పాములు నివసిస్తాయి.
3) పర్వతాల నుండి జలపాతాలు కిందికి జాలువారుతున్నాయి.
పర్వతాల : కొండల
వాక్యం: కొండల నుండి జలపాతాలు కిందికి జాలువారుతున్నాయి.
4) సూర్యకాంతికి తామరాకుపై నీటిబిందువులు ధగధగ మెరుస్తున్నాయి.
ధగధగ : ప్రకాశవంతంగా / మిలమిల
వాక్యం: సూర్యకాంతికి తామరాకుపై నీటిబిందువులు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి.
5) కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి.
విస్తరాకులు: శుభకార్యాలలో విస్తరాకులలో భోజనం వడ్డిస్తారు.
www.meebadi.in
సాధనపత్రం 5 - పదజాలం (పేజీ 26)
-
అ) కింది ఆధారాలతో పట్టిక పూరించండి.అడ్డం:
1. కొండకు మరొక పేరు (3) → పర్వతం
2. చేపలు పట్టుకుని తినే తెల్లని పక్షి (2) → కొంగ
3. ఒక తియ్యని పండు (3) → సపోటా
4. గుడిలో, బడిలో కొట్టేది (2) → గంటనిలువు:
1. గాలిలో ఎగిరేది (2) → పక్షి
2. తక్కువమందిని ఇలా అంటారు (3) → కొంచెము
3. నదులన్నీ దీనిలో కలుస్తాయి (3) → సముద్రం
4. అన్నం వార్చితే వచ్చేది (2) → గంజిప ర్వ తం కొం గ క్షి చె ము స పో టా ము గం ట ద్రం జి -
ఆ) సరైన జవాబును గుర్తించండి.1. మనం చెత్తను చెత్తబుట్టలో వేయాలి. ఇది దేనిని సూచిస్తుంది? ( ఇ )అ) కాలుష్యం ఆ) అశుభ్రత
ఇ) శుభ్రత ఈ) ప్రమాదంజ: ఇ) శుభ్రత2. విద్యార్థులు చెట్లను కాపాడాలని నినాదాలు చేశారు. ఇది ఏ పదానికి సరిపోతుంది? ( ఆ )అ) భూసంరక్షణ ఆ) వనసంరక్షణ
ఇ) జలసంరక్షణ ఈ) జంతు సంరక్షణజ: ఆ) వనసంరక్షణ3. ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ వల్ల గాలి మలినమవుతుంది. దీనిని ఏమంటారు?జ: గాలి కాలుష్యం (వాయు కాలుష్యం)
www.meebadi.in
సాధనపత్రం 6 - స్వీయరచన (పేజీ 27)
-
స్వీయరచన - ప్రశ్నలు – జవాబులు1. జావేద్ లేఖను ఎవరికి రాశాడు?జ: జావేద్ లేఖను తన మిత్రుడైన నరేష్‌కు రాశాడు.2. మీరు చూసిన ఏదైనా కొండ గురించి రెండు వాక్యాలు రాయండి.జ:
1. నేను తిరుమల కొండలను చూశాను. అవి పచ్చని చెట్లతో, జలపాతాలతో చాలా అందంగా ఉంటాయి.
2. ఆ కొండల పైకి వెళ్లే దారిలో ప్రయాణం చేయడం ఎంతో ఆనందంగా అనిపిస్తుంది.3. నీటి బుగ్గ దగ్గర నుండి పాయలు ఎలా వస్తున్నాయి?జ: నీటి బుగ్గ దగ్గర నుండి స్వచ్ఛమైన నీరు గలగలపారే చిన్న చిన్న పాయలుగా విడిపోయి, కిందికి ప్రవహిస్తూ వస్తున్నాయి.4. కొండపై నుండి ఊరిని చూసినప్పుడు మీకు కలిగిన అనుభూతిని రాయండి.జ: కొండపై నుండి ఊరిని చూసినప్పుడు ఇళ్ళన్నీ చిన్న బొమ్మల్లా, పొలాలు పచ్చని తివాచీలా చాలా అందంగా కనిపించి మనసు ఎంతో ఆహ్లాదంగా, అద్భుతంగా అనిపించింది.5. ఒక గ్రామం ప్రకృతి సమతుల్యంగా ఉండడానికి మనం ఏమి చేయాలో మీ మాటల్లో రాయండి.జ:
1. గ్రామంలో ఎక్కువ చెట్లను నాటాలి, ఉన్న చెట్లను నరకకుండా కాపాడుకోవాలి.
2. చెరువులు, కాలువలు మలినం కాకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
3. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి.6. రామం వాళ్ళ ఊరి చుట్టూ ఏమి ఉన్నాయో తెలుసుకున్నాం కదా! మరి మీ ఊరు చుట్టూ ఏమి ఉన్నాయో ఐదు వాక్యాలు రాయండి.జ:
1. మా ఊరి తూర్పు వైపున పచ్చని పంట పొలాలు ఉన్నాయి.
2. పడమర వైపున ఒక పెద్ద మంచి నీటి చెరువు ఉంది.
3. ఉత్తరం వైపున ఎత్తైన చిన్న కొండలు కనిపస్తాయి.
4. దక్షిణం వైపున పెద్ద కొబ్బరి తోటలు మరియు మామిడి తోటలు ఉన్నాయి.
5. మా ఊరి చుట్టూ ఉన్న ప్రకృతి వాతావరణం ఎంతో ప్రశాంతంగా, అందంగా ఉంటుంది.
www.meebadi.in
సాధనపత్రం 7 - భాషాంశాలు (పేజీ 28)
-
అ) కింది వాక్యాలలో నామవాచకాన్ని, సర్వనామాన్ని గుర్తించండి. వాటి కింద గీత గీయండి.1. వీరన్న పొలానికి వెళ్ళాడు. అతడు మామిడికాయలు కోసాడు.
నామవాచకం: వీరన్న
సర్వనామం: అతడు
2. సునీత, వినీత బజారుకు వెళ్ళారు. వాళ్ళు కూరగాయలు కొన్నారు.
నామవాచకం: సునీత, వినీత
సర్వనామం: వాళ్ళు
3. పిల్లి పాలు తాగింది. అది మ్యావ్ మ్యావ్ అంటూ పారిపోయింది.
నామవాచకం: పిల్లి
సర్వనామం: అది
4. దివ్య బడికి వెళ్ళింది. ఆమె పరీక్ష రాసింది.
నామవాచకం: దివ్య
సర్వనామం: ఆమె -
ఆ) కింది వాక్యాలను పరిశీలించండి. ఖాళీలలో సరైన సర్వనామాన్ని రాయండి.1. ఆనంద్ చెరువుకు వెళ్ళాడు. అతడు చేపలు పట్టాడు.
2. విశాఖపట్టణంలో బీచ్ ఉంది. అది సుందరమైన నగరం.
3. నెమలి అందమైన పక్షి. దానికి అందమైన ఈకలు ఉంటాయి.
4. రాజు హోటల్‌కు వెళ్ళాడు. అతడు పూరీ తిన్నాడు.
5. సిరి సంగీతం నేర్చుకుంది. ఆమె పాటలు బాగా పాడుతుంది. -
ఇ) కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.1. రాము రోజు బడికి వెళుతున్నాడు. గీత గీసిన పదం ఏ భాషాభాగానికి చెందినది?జ: నామవాచకం2. ఖాళీలో సరైన సర్వనామాన్ని రాయండి.
ఇందు బొప్పాయి తిన్నది. _______ కు బొప్పాయి అంటే చాలా ఇష్టం.జ: ఆమె3. కింది వానిలో సర్వనామాన్ని గుర్తించండి. ( ఇ )సిరి, నేను కలిసి తిరుపతి వెళ్ళాము.అ) సిరి ఆ) తిరుపతి
ఇ) నేను ఈ) వెళ్ళాముజ: ఇ) నేను4. అమ్మ కూరగాయలు తెచ్చింది. అవి తాజాగా ఉన్నాయి. "అవి" దేనికి బదులుగా వాడారు? ( ఆ )అ) అమ్మ ఆ) కూరగాయలు
ఇ) మార్కెట్ ఈ) సంచిజ: ఆ) కూరగాయలు
www.meebadi.in
సాధనపత్రం 8 - సృజనాత్మకత (పేజీ 29)
-
ఊహించి రాయండి – మీరైతే ఏమి చెప్తారు?ఉదాహరణ:
నేనే పుస్తకాన్ని అయితే : నాకు అట్ట వేసి జాగ్రత్తగా ఉంచుకో. రోజు నన్ను చూడు. నాతో మాట్లాడు.1. పుస్తకాల సంచి (స్కూల్ బేగ్) :
జ: "నన్ను ఎక్కువ బరువుతో నింపకు. శుభ్రంగా ఉంచుకో మరియు కింద పడేసి దుమ్ము అంటించకు."2. పెన్ (కలం) :
జ: "నాతో మంచి అక్షరాలు రాయి. నా మూత జాగ్రత్తగా పెట్టు, నన్ను కింద పడేసి పాడుచేయకు."3. స్కేలు :
జ: "నాతో నిలువుగా, చక్కగా గీతలు గీయు. నన్ను విరిచేయకుండా జాగ్రత్తగా వాడుకో."4. ఏకరూప దుస్తులు (యూనిఫాం) :
జ: "నన్ను ఉతికి శుభ్రంగా, ఇస్త్రీ చేసి వేసుకో. నాపై సిరా లేదా మురికి మరకలు పడకుండా చూసుకో."5. బూట్లు (షూస్) :
జ: "నన్ను ప్రతిరోజూ పాలిష్ చేసి మెరిపించు. నీ కాళ్ళకు రక్షణగా ఉంటాను, మురికి నీటిలో తొక్కకు."
www.meebadi.in
సాధనపత్రం - నేనేమి నేర్చుకున్నాను? (పేజీ 30)
-
అ) కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.1. కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి.
కొన్ని ప్రాంతాలకు వాగు నీరే ఆధారం.జ: ఏరు / చిన్న సెలయేరు2. కింది పదంతో సొంతవాక్యాన్ని రాయండి.
ఆకాశం:జ: రాత్రి వేళ ఆకాశంలో నక్షత్రాలు మిలమిల మెరుస్తాయి.3. వాక్యాన్ని చదవండి. సర్వనామాన్ని గుర్తించండి. ( ఆ )నా పేరు హేమ. నేను ఐదవ తరగతి చదువుతున్నాను.అ) హేమ ఆ) నేను
ఇ) ఐదవ తరగతి ఈ) చదువుతున్నానుజ: ఆ) నేను -
ఆ) కింది పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.పిల్లలు సర్కస్ చూడడానికి వెళ్లారు. అక్కడ రంగురంగుల టెంట్, పెద్దపెద్ద జంతువులు, చురుకైన కళాకారులను చూసి పిల్లలు చాలా ఆనందించారు. జోకర్ చేసిన సరదా చేష్టలకు అందరూ నవ్వారు. గాలిలో ఊగే ఆటలు, రింగ్‌లపై చేసే విన్యాసాలు చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు. సర్కస్ పిల్లలకు వినోదంతో పాటు ధైర్యసాహసాలను కూడా నేర్పింది.1. పిల్లలు ఆనందించడానికి కారణం ఏమిటి?జ: సర్కస్‌లో రంగురంగుల టెంట్, పెద్దపెద్ద జంతువులు, చురుకైన కళాకారులను చూడడం వల్ల పిల్లలు ఆనందించారు.2. సర్కస్ ద్వారా ఏమి నేర్చుకున్నారు?జ: సర్కస్ ద్వారా పిల్లలు వినోదంతో పాటు ధైర్యసాహసాలను కూడా నేర్చుకున్నారు.3. జోకర్ చేసిన పనికి పిల్లలు ఎలా స్పందించారు? ( ఇ )అ) భయపడ్డారు ఆ) ఏడ్చారు
ఇ) నవ్వారు ఈ) నిద్రపోయారుజ: ఇ) నవ్వారు -
ఇ) కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.1. జావేద్ దసరా సెలవులకు ఊరు వెళ్లాడు కదా! బడికి సెలవులు ఇచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు?జ: బడికి సెలవులు ఇచ్చినప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి / నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాము.2. నీటి బుగ్గ నుండి నీరు ఎలా వస్తుందని పాఠంలో చెప్పారు?జ: నీటి బుగ్గ నుండి స్వచ్ఛమైన నీరు గలగల పారుతూ చిన్న పాయలుగా కిందికి వస్తుందని చెప్పారు.
www.meebadi.in
సాధనపత్రం - నేనేమి నేర్చుకున్నాను? (పేజీ 31)
-
ప్రశ్నలు – జవాబులు (కొనసాగింపు)3. వర్షం వచ్చే ముందు ప్రకృతి ఏ విధంగా ఉంటుందో రాయండి.జ: వర్షం వచ్చే ముందు ఆకాశంలో నల్లటి మేఘాలు ఒత్తుగా కమ్ముకుంటాయి. చల్లని ఈదురుగాలులు వీస్తాయి, ఉరుములు ఉరుముతూ మెరుపులు మెరుస్తాయి. పక్షులన్నీ తమ గూళ్లకు చేరుకోవడానికి కలకలం చేస్తూ ఎగురుతాయి.4. పాఠంలో మేఘాలను ఏ విధంగా వర్ణించారు?జ: పాఠంలో మేఘాలు ఒకదానిపై ఒకటి పడి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేసే పింజెమబ్బులుగా, తూర్పు వైపున ఒత్తుగా కదిలే నల్లని మేఘాలుగా వర్ణించారు.5. రామం, సూర్య వాగు చూడడానికి వెళ్లారు కదా! మీరు విహారయాత్రకు వెళితే, మీ బృందానికి ఏయే జాగ్రత్తలు సూచిస్తారు?జ:
1. ఎల్లప్పుడూ అందరూ గుంపుగా ఉండాలి, ఎవరూ ఒంటరిగా లోతైన నీటి ప్రదేశాలకు వెళ్లకూడదు.
2. పెద్దలు లేదా ఉపాధ్యాయుల సూచనలను ఖచ్చితంగా పాటించాలి.
3. ప్రథమ చికిత్స పెట్టి (First Aid Kit) మరియు సరిపడా తాగునీరు వెంట ఉంచుకోవాలి. -
ఈ) నదులు తమ నీటిని తాము త్రాగవు, కానీ అవి పంటలు పండటానికి, మన దాహం తీర్చడానికి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. నదుల యొక్క 'సహాయ గుణాన్ని' అభినందిస్తూ నాలుగు వాక్యాలు రాయండి.జ:
1. నదులు స్వార్థం లేకుండా సమస్త జీవకోటికి, మానవాళికి జీవనాధారంగా నిలుస్తున్నాయి.
2. తన నీటితో పంటలను పండించి, పశుపక్ష్యాదుల, మనుషుల దాహాన్ని తీరుస్తూ గొప్ప త్యాగనిరతిని చూపుతాయి.
3. ఏ ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సహాయం చేయడం ఎలాగో నదులను చూసి మనం నేర్చుకోవాలి.
4. పరోపకార గుణానికి నిదర్శనమైన నదులను కలుషితం చేయకుండా కాపాడుకోవడం మనందరి బాధ్యత.
www.meebadi.in