1927 డిశంబరు 19..ఫైజాబాద్ జైల్ ..27 యేండ్ల యువకుడిని ఉరికంబం దగ్గరకు తీసుకెళుతున్నారు..చాలా ధైర్యంగా తడబాటు లేకుండా నడుస్తూ ఉరికొయ్య దగ్గరకు వెళ్ళేడు ఆ యువకుడు. ఉరితాడు మెడకు తగిలించే ముందు ఒక్కసారి బిగ్గరగా ఇలా ఆవేశంగా మాట్లాడేడా యువకుడు..
" హే మాతృభూమీ,తేరా సేవా కియా కరూంగా,ఫాం సే మిలే ముజే,యా వో జన్మఖైద్ మేరీ,బేడీ బజా బజా కర్ తేరా భజన్ కరుంగా.( ఓ నా మాతృదేశమా సదానీకు సేవచేస్తూనే వుంటాను.ఉరిశిక్ష పడినా,జన్మఖైదు పడినా ,బేడీల దరువుతో నీ నామ స్మరణ చేస్తూనే వుంటాను.)
ఈ ఆంగ్లేయుల దాస్యశృంకులాలనుండి ఈ హిందూస్తాన్ కు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను సాధించుటకు ఏడు కోట్ల ముస్లిమ్స్ తరుపున ఉరికొయ్యకు బలైవుతాను..నన్ను చూసి ఎంతో మంది ప్రేరణ పొంది హిందూస్తాన్ మొత్తం ఈ ఆంగ్లేయులపై దాడి చేస్తుంది..తప్పకుండా హిందూస్తాన్ స్వాతంత్ర్యం పొందుతుంది...
ఇలా గంభీరమైన మాటలతో ఉత్తేజభరితంగా ప్రసంగించినవాడు..స్వాతంత్ర్యపోరాటంలో ఉరికంబం ఎక్కిన మొదటి ముస్లిమ్ వీరుడు "అష్ఫాకుల్లా ఖాన్ "
చౌరీచౌరా సంఘటనతో గాంధీజీ సహాయనిరాకరణోద్యమాన్ని నిలిపివేయగా తీవ్ర అసంతృప్తికి గురైన యువకులలో ఈ అష్ఫాకుల్లా ఖాన్ ఒకడు.. సాంప్రదాయకమైన ముస్లిమ్ కుటుంబంలో ఆరో సంతానంగా పుట్టిన అష్ఫాకుల్లాఖాన్ తన తండ్రి పోలీసుగా పని చేస్తున్నా,, అతివాదం వైపు మళ్ళాడు.. అతనికి రాంప్రసాద్ బిస్వాస్ ,రాజేంద్ర లహరి, రోషన్ సింగ్ ,సచీంద్రభక్షి, చంద్రశేఖర్ అజాద్ ,కేశవ్ చక్రవర్తి,బన్వర్ లాల్ ,మన్మధనాథ్ గుప్తలాంటి నాయకులతో పరిచయం అయింది..
వీరు ఆయుధాల కొనుగోలు కోసం ప్రభుత్వఖజానాన్ని దోచుకోవాలనుకున్నారు. 1925 ఆగష్టు 26 న "కాకోరి "రైలులో పోతున్న ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారు,. ఇందులో అష్ఫాకుల్లాఖాన్ ప్రముఖపాత్ర వహించాడు.. ఆంగ్లేయప్రభుత్వం వీరి మీద కక్షగట్టింది..ముందుగా రాంప్రసాద్ బిస్వాస్ ను అరెష్ట్ చేసింది.ఖాన్ అజ్ఞాతంలోనికి వెళ్ళాడు..పది నెలలు అజ్ఞాతం లో గడిపి మరో వ్యూహం పన్నేందుకు ఢిల్లీకి వచ్చి ఒక పఠాన్ మిత్రుడిని సహాయం కోరగా అతడు నమ్మకద్రోహం చేసి ఆంగ్లేయులకు పట్టించాడు.. చివరికి రాంప్రసాద్ ,రాజేంద్రలహరి,రోహన్సింగ్ ,ఖాన్ కు ఉరిశిక్ష విధించారు. 1927 డిశంబరు 19 న ఫైజాబాద్ లో ఆయనను ఉరితీశారు..
అప్షాకుల్లాఖాన్ తరచూ ఇలా చెప్పేరు వారు.." పుట్టుకతో నేను హిందూస్తానీని...తర్వాతే ముసల్మాన్ ని, మనకు మతం కంటే దేశం ముఖ్యం, అందుకే సోదరులారా!!!! మతం పక్కనబెట్టండి..దేశం కోసం పోరాడండి...మతాలకతీతంగా ఐకమత్యంగా ఉండండి...మతం మన అనైఖ్యతకు వారిది కారాదు..మనమంతా భారతీయులమే....
ఈ రోజు ఆయన ఉరికంబం ఎక్కినరోజు...ఆ వీరునికి
లాల్ సలామ్ ...అశ్రువునివాళులు..