Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జనవరి 23 (JANUARY 23)

0

 

సంఘటనలు


  • 1565: తళ్లికోట యుద్ధము
  • 1556: చైనాలోని షాంగ్జీ ప్రాంతంలో సంభవించిన ఘోర భూకంపంలో ఎనిమిది లక్షల మందికి పైగా మరణించారు.
  • 1950: ఇజ్రాయిల్ పార్లమెంటు నెస్సెట్‌జెరూసలేంను తమ రాజధాని నగరంగా ప్రకటించింది.
  • 1977: 'జనసంఘ్‌', 'భారతీయ లోక్‌దళ్‌', కాంగ్రెస్‌ (ఓ), 'స్వతంత్ర పార్టీ', 'సోషలిస్టు పార్టీ'లు కలిసి 'జనతాపార్టీ'గా ఏర్పడ్డాయి.
  • 2011 : పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన భాస్కర శ్రీనివాస్ APL ఆంధ్రా ప్రీమియర్ లీగ్ లో తన ప్రస్థానానికి మొదటి అడుగు వేశారు. 2011 నుంచి 2017 వరకు వెస్ట్ చీతాస్ జట్టుకు టీం కెప్టెన్ గా తన సేవలు అందించారు. 2018 నుంచి వెస్ట్ చీతాస్ టీం ప్రధాన కోచ్ గా తన సేవలు కొనసాగిస్తున్నారు. ఆంధ్రా క్రికెట్ ఆర్గనైజేషన్ ఇతని సేవలు గుర్తించి 2019 లో క్రీడా తరంగ అవార్డు ఇచ్చి సత్కరించింది.


జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 


  • సుభాష్‌చంద్రబోస్ జయంతి, 
  • దేశభక్తి దినోత్సవం.


జననాలు


  • 1863: వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు (మ.1936)
  • 1890: హిల్డా మేరీ లాజరస్, ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు. (మ.1978)
  • 1893: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, ప్రముఖ తెలుగు సాహితీకారులు. (మ.1979)
  • 1897: సుభాష్ చంద్రబోస్, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1945)
  • 1906: ముదిగొండ విశ్వనాధం, ప్రముఖ గణితశాస్త్రజ్ఞడు మరియు శివపూజా దురంధురుడు. (మ.1984)
  • 1911: జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు. (మ.2009)
  • 1915: ఆర్థర్ లూయీస్, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
  • 1926: బాల్ థాకరే, శివసేన పార్టీ స్థాపకుడు. (మ.2012)



మరణాలు



  • 1972: కె. అచ్యుతరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు. (జ. 1914)
  • 1978: హిల్డా మేరీ లాజరస్, ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు. (జ.1890)
  • 2015: ఎం. ఎస్. నారాయణ, ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు. (జ.1951)
  • 2016: ఏ.సి.జోస్ మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ శాసనసభ స్పీకర్. (జ.1937)
  • 2018: వెంపటి రవిశంకర్‌, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1969)




Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages