Type Here to Get Search Results !

ఇంక్రిమెంట్లు-రకాలు:

0
ఇంక్రిమెంట్లు-రకాలు:

 ఒక సంవత్సర కాలము పాటు సంతృప్తికరంగా సేవలందించిన ఉద్యోగికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని వార్షిక ఇంక్రిమెంట్లు అందురు.

 ఒక ఉద్యోగిపై ఆరోపణలు చార్జిషిటు పెండింగ్ లో ఉంటే తప్ప ఆ ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంటు నిలపరాదు.

 APFC లోని ఫారం-49 లో డ్రాయింగ్ అధికారి ఇంక్రిమెంట్ ధృవపత్రంపై సంతకం చేసి వేతన బిల్లుకు జతపరచకపోతే ,ప్రభుత్వ ఉద్యోగికి ఇంక్రిమెంటు చెల్లించరు.
(G.O.Ms.No.212 Fin Dt:16-05-1961)

 నెల మధ్యలో ఇంక్రిమెంట్ తేది ఉంటే అదే నెల మొదటి తేదికి మార్చబడుతుంది.
(G.O.Ms.No.133 Fin Dt:13-05-1974)
(G.O.Ms.No.546 Edn Dt:05-07-1974)

 DSE ఉత్తర్వులు 3781/74 Dt:13-22-1974 ప్రకారం దండన క్రింద ఇంక్రిమెంట్లను నిలిపివేసిన కేసులలో ఇంక్రిమెంట్లు దండన సమాప్తమైన తేది నుండి మంజూరు చేయబడతాయి/పునరుద్ద రించబడతాయి.

 ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్లు మంజూరు చేయరాదు. డ్యూటీలో చేరిన తరువాతే మంజూరు చేయాలి.
(Memo.No.49463 Dt:06-10-1974)

 ఉద్యోగి మొదటి వార్షిక  ఇంక్రిమెంట్ 12 నెలలు పూర్తికాకుండానే మంజూరు చేయబడుతుంది.

Eg: ఒక ఉద్యోగ నియామక తేది 28-12-2012 సదరు ఉద్యోగి మొదటి ఇంక్రిమెంట్ 01-12-2013 న మంజూరు అవుతుంది.

 నెల ఆఖరి రోజు సాయంత్రం నూతనంగా సర్వీసులో చేరినవారు తరువాత నెల మొదటి తేది నుండి జీతమునకు అర్హులు.జీతం తీసుకున్న నెలయే ఇంక్రిమెంట్ తేది అవుతుంది.

 వార్షిక ఇంక్రిమెంట్ కు లెక్కించబడిన కాలమే అప్రయత్న పదోన్నతి పథకం(AAS) స్కేళ్ళ మంజూరుకు పరిగణించబడుతుంది.

   ఇంక్రిమెంట్ కు పరిగణింపబడు కాలము

- ఒక వేతన స్కేలు లో ఉద్యోగి చేసిన డ్యూటీ కాలం.

- అన్ని రకాల సెలవులు (జీత నష్టపు సెలవు తప్ప)

- డిప్యూటేషన్ పై పనిచేసిన కాలము.

- అనుమతించబడిన మేరకు జాయినింగ్ కాలం.

- పై పోస్టులో గడిపిన కాలం క్రింది పోస్టులో ఇంక్రిమెంట్ కు పరిగణించబడుతుంది.

- ప్రభుత్వ సెలవులు మరియు వెకేషన్ కాలం.

- ఉద్యోగం చేస్తూ పొందిన శిక్షణా కాలం (డ్యూటీ గా పరిగణించబడి నప్పుడు మాత్రమే)

   ఇంక్రిమెంటునకు పరిగణింపబడని కాలం

- జీతనష్టపు సెలవు ఇంక్రిమెంట్ కు పరిగణించబడదు. సదరు సెలవు వాడుకున్న రోజులు ఇంక్రిమెంటు వాయిదా పడుతుంది.

- జీతనష్టపు సెలవు వాడు కొన్నానూ ఇంక్రిమెంటు వాయిదా పడని సందర్భము:

- వైద్య కారణాలపై,శాస్త్ర,సాంకేతిక ఉన్నత విద్యకై ఇంకా ఉద్యోగ పరిధిలో లేని కారణాలపై జీతనష్టపు సెలవు వాడుకొన్ననూ 6 నెలల వరకు సెలవు కాలాన్ని ఇంక్రిమెంటుకు లెక్కించు అధికారం ప్రభుత్వ శాఖాధిపతులకు ఇచ్చింది (ఉపాధ్యాయుల విషయంలో కమిషనర్ మరియు విద్యా సంచాలకుల వారు) (FR-26(2)) & G.O.Ms.No.43 F&P Dt:05-02-1976)

- 6 నెలల కంటే ఎక్కువ జీతనష్టపు సెలవు వాడుకున్న సందర్భాలలో ప్రభుత్వానికి అప్పీలు చేసుకోవాలి.

   ఇంక్రిమెంట్లు నిలుపుదల సందర్భాలు:

తప్పుడు ప్రవర్తనా , విధి నిర్వహణలో అలక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యగా ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్లు 2 రకాలుగా నిలుపుదల చేయవచ్చును.

 Without Cumulative Effect:

FR-24(1) ప్రకారం కేవలం ఒక సం॥ మాత్రమే నిలుపుదల చేసి తదుపరి ఇంక్రిమెంట్ తేది నాడు విడుదలచేస్తారు. అంటే సదరు ఉద్యోగి ఒక సం॥ పాటు లేదా అంతకన్నా తక్కువ కాలం ఏరియర్స్ పోగొట్టుకుంటారు.

With Cumulative Effect:

దీన్ని అమలుచేసే ముందు విచారణాధికారిని నియమించాలి. సదరు ఉద్యోగి తన వాదనను వినిపించేoదుకు అవకాశం ఇవ్వాలి. ఉద్యోగికి చార్జిషిటు అందించడమే కాకుండా ఏ సాక్ష్యాధారాల ప్రకారం ఉద్యోగిపై ఆరోపణ చేయబడినదో కూడా అందించాలి. ఈ శిక్ష ప్రకారం ఉద్యోగి శాశ్వతంగా ఇంక్రిమెంటు కోల్పోతాడు.

--------------------------------------------------------


INCREMENT ARREAR BILL

1. ఇంక్రిమెంట్ బకాయి బిల్లు ను ఖజానా కార్యాలయంలో A.P.T.C. ఫారం 47 లో  సమర్పించాలి.

2. CCA నిబంధనల ప్రకారం సమర్థ అధికారి(Competent Authority) చే దుష్ప్రవర్తన లేదా అసంతృప్తికరమైన పని వంటి చర్యలు గైకొంటే తప్ప(FR 24) విధి నిర్వహణలో ఒక సంవత్సరం సంతృప్తికరమైన సేవ పూర్తి చేసిన తరువాత ఉద్యోగికి సాధారణంగా ఇంక్రిమెంట్ నిలిపివేయకుండగా మంజూరు చేయబడాలి. 
 
 3. ఎఫ్ఆర్ 26 (ఎ) ప్రకారం ఒక పోస్ట్‌లో  (టైమ్ స్కేల్ గణనపై) చేసినట్టి డ్యూటీ అంతయు ఇంక్రిమెంట్ కోసం పరిగణనలోకి తీసుకోవడం జరుగును.

 4. FR 26 (బి) (i) ప్రకారం అన్ని భత్యాలతో మంజూరు చేసిన సెలవు ఇంక్రిమెంట్ కి పరిగణనలోకి తీసుకోబడుతుంది.

 5. Medical Certificate పై EOL లేదా ప్రభుత్వ ఉద్యోగుల నియంత్రణలో లేని ఇతర కారణాలు లేదా
 ఉన్నత శాస్త్రీయ లేదా సాంకేతిక అధ్యయనాలను అభ్యసించడం కోసం సెలవు పొందిన యెడల తిరిగి డ్యూటీ లో చేరిన తదుపరి ప్రభుత్వం కి 5 ఏళ్లు సేవ చేస్తామని అంగీకారాన్ని తెల్పినపుడు ఆ ఉద్యోగి పొందిన లీవ్ పీరియడ్ కూడా ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడును ( EOL కాలానికి ఇంక్రిమెంట్ ) .కాని ఇది ఉద్యోగి  మొత్తం సేవా కాలం లో ఒక సారి మాత్రమే మంజూరు చేయబడును. ఈ మంజూరు కి ఆరు నెలల కన్నా తక్కువ కాలానికి  HOD మరియు  6 నెలలు అంతకు మించిన కాలానికి ప్రభుత్వం కి మాత్రమే అధికారం కలదు.
 [Ref: FR 26 b (ii) & Cir Memo.No.  యొక్క 21102-B / 371 / A2 / FR.I / 98 dt.7-8-98
 F&P [FW.FR.I] విభాగం.]

 6. ఇంక్రిమెంట్ చెల్లించాల్సిన నెల 1 వ తేదీ నుండి ఇంక్రిమెంట్ డ్రా అవుతుంది.
ఉదాహరణకు ఉద్యోగి Apr 19,2019 న విధులలో చేరాడు.అతని వార్షిక ఇంక్రిమెంట్ Apr 1, 2020 నుండి డ్రా చేయబడుతుంది.
 [Ref: G.O.Ms.No.133, F & P, Dt.13-05-74 మరియు GOMsNo192, F & P Dt.1-
 8-74

 7. ఇంక్రిమెంట్ కోసం లెక్కించని కాలాలు.
 ఎ) ప్రైవేట్ వ్యవహారాలపై EOL
 బి) FR18 కింద డైస్-నాన్-నాన్ గా పరిగణించబడే కాలం
 సి) క్రమబద్ధీకరించబడని అనుమతించిన దాని కంటే ఎక్కువ సమయం తీసుకున్న (excess) జాయినింగ్ టైం.
 d)అనుమతి లేకుండా లీవ్ నందు కొనసాగడం
 ఇ)  "నాట్ డ్యూటీ" గా పరిగనించిన సస్పెన్షన్ పీరియడ్
 f) అంతరాయ కాలం
 g) FR 35 ప్రకారం టైం స్కేల్ నందు  కనీస సమయం కంటే తక్కువ సర్వీస్ చేయడం
 h) అప్రెంటిస్‌గా సేవ

 8. E.O.L కాకుండా అనుమతి పొందిన సెలవు కాలంలో ఇంక్రిమెంట్ వస్తే ఆ ఇంక్రిమెంట్ పెరుగుదల సదరు అర్హత తేదీ నుండి మంజూరు చేయబడుతుంది
 కానీ ద్రవ్య ప్రయోజనం(Monetory Benefit) సెలవు గడువు ముగిసిన తరువాత చేరిన తేదీ నుండి ఇవ్వబడుతుంది.
ఉదాహరణకు ఒక ఉద్యోగిని 01.01.2020 నుండి 6 నెలల materinity లీవ్ కి అనుమతి పొందారు.వారి ఇంక్రిమెంట్ ఏప్రిల్ నెలలో ఉంటే వారికి ఇంక్రిమెంట్ 01.04.2020 నుండి మంజూరు చేసినా, ఆర్ధిక ప్రయోజనం మాత్రం 6 నెలల లీవ్ ముగిసి డ్యూటీ లో చేరిన తేదీ నుండి మాత్రమే ఇస్తారు.

9. EOL విషయంలో కూడా ఇంక్రిమెంట్  తదనుగుణంగా వాయిదా వేయబడుతుంది.

 10. డిడిఓ ఇంక్రిమెంట్ మంజూరు ఉత్తర్వులతో పాటుగా APTC ఫారమ్ 49 లోని ఇంక్రిమెంట్ సర్టిఫికేట్ (15 నిలువు వరుసలలో ఉంటుంది) కూడా ఖచ్చితంగా జతపర్చాలి.
  [Ref: SR 13 & 15 OF TR 16 A.P. ట్రెజరీ కోడ్ వాల్యూమ్ -1]

 11. ఉద్యోగి సస్పెన్షన్ కాలంలో ఇంక్రిమెంట్ మంజూరు చేయబడదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages