ఒక అడవిలో ఒక పెద్ద చెరువు
ఉంది. దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసముంటున్నాయి. ఆ చెరువు అడవి లోపల ఎక్కడో
ఉండటం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా ఉండేవి. ఒకరోజు ఆ అడవి మీదగా
ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది. ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా
ఉన్నానా అనుకుని ఆశ్చర్యపోతూ ఆ చెరువు గట్టుపైన వాలింది. దానికి చెరువులో చాలా
చేపలు కనిపించాయి. ఇక తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకొని ఆనందంగా అక్కడే కొంత
దూరంలో నివాసం ఏర్పరుచుకుంది. ప్రతిరోజూ మూడుపూట్లా హాయిగా చేపలను తింటూ కాలం
గడుపుతుంది. ఈలోగా చేపలు కంగారు పడటం ప్రారంభించాయి. ప్రతిరోజూ తమలో కొంతమంది
కొంగకి బలైపోవడం చేపలకి భయం కలిగించింది.
ఇలా అయితే కొన్ని రోజులకి తామేవ్వరమూ
మిగలమని తెలుసుకొని, ఒకరాత్రి చేపలన్నీ కలిసి కొంగ
బారి నుండి రక్షించుకొనే ఉపాయం ఆలోచించసాగాయి. ఒక చేపపిల్ల నాకొక ఉపాయం తట్టింది,
కాని దానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పింది. ఏమిటది అని
మిగతా చేపలు అడిగాయి.
చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపల్ని
తినటానికి కొంగ చెరువు వద్దకు వచ్చింది. కాని చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించటం
చూసి ఆశ్చర్యపోయింది. చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి, ఏమైఉంటుందో అని ఆలోచించసాగింది.
ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ
కనిపించింది. కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోడానికి ముందుకు వచ్చింది. కాని ఆ చేప
కొంగతో నీకు బతకాలని ఉంటే నా మాట విను అన్నది. కొంగ ఆగి ఏమిటో చెప్పు అన్నది.
నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరకు వచ్చి నీళ్ళు తాగబోయింది. ఈలోగా ఒక పెద్దచేప
దానిని కొరికింది. దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది.
దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి. అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి,
నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను. నన్ను తింటే నువ్వు కూడా
చనిపోతావు జాగ్రత్త అని చెప్పింది. దాంతో భయపడ్డ కొంగ ఇక ఆ చెరువులో తనకి ఆహారం
దొరకదని తెలుసుకొని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. చేపపిల్ల పాచిక
పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి.
The intelligence
of a fish
There is a big pond in a forest. Many fishes have been living in
it for a long time. As the pond was somewhere inside the forest, the fish were
comfortable without enemies. One day a stork flying over the forest saw the
pond. Wondering how he had not seen such a big pond for so long, he leaned on
the bank of the pond. There were many fish in the pond. Thinking that there was
no problem with her food, she happily settled there at some distance. She
spends her days comfortably eating fish for three meals a day. In the meantime,
the fish started getting confused. Every day some of them fell prey to the
stork which scared the fish.
Knowing that they would be alone for a few days,
they thought of a trick to save all the fish from the clutches of the stork one
night. A fish gave me a trick, but it needs your cooperation. The other fishes
asked what.
The fish told them his trick. The next
morning the stork came to the pond to eat the fish. But she was surprised to
see all the fish floating in the pond. Looking at all these fishes seem to be
dead, she started thinking what is happening.
Meanwhile, a fish was seen
falling and getting up. The stork happily came forward to catch the fish. But
if you want to live with that fish stork, listen to me. Stork stop and tell me
what it is. Last night a cobra came to the pond to drink water. Meanwhile a big
fish bit it. The snake got angry and swallowed the poison in the pond. All the
water in the pond has become poisonous. That's why all the fish are floating
dead, and I'm going to die in a moment. She says beware if you eat me you will
also die. The stork got scared and knew that he would not find food in that
pond anymore and went in search of another pond. All the fishes were very happy
when the dice was rolled.
తెలుగు కృత్యం
English Activity
Circle the words that are wrongly spelt and
write its correct spelling in the blanks.
- 1. tabel,
flute, box. : __________________
- 2. giant,
mother, song. : __________________
- 3. jamped,
sing, walked :. __________________
- 4. young,
pretty, butiful.: __________________
- 5. castle,
house, pleyground : _________________
Maths Activity
Write the addition forms to the following
subtraction form.
Ex : 55 - 40 =
15
15
+ 40
= 55
- a. 75 – 50 = 25
- b. 88 – 23 = 65
- c. 91 – 18 = 73
- d. 215 – 33 = 182
- e. 687 – 254 = 433
- f. 999 – 100 = 899
- g. 987 – 586 = 401
- h. 800 – 0 = 800
- i. 260 - 34 = 226
- j. 500 – 200 =300
PUZZLE / RIDDLE
Yesterday Puzzle / Riddle Key
)) 2+2 =4
2)) 2x(10+10) =2x20 =40
3)) 10x3 =30
4)) (2+2)+3 =4+3 =7
So Answer is 7