నాటు కోడి ప్రకృతి సహజంగా పరిణామ క్రమంలో ఆవిర్భవించిన ఓ జీవి. ఇది ఒక సకశేరుక
(vertebrate)
పక్షివర్గపు (aves) జంతువు. ప్రకృతి సిద్ధంగా ప్రతి జీవి తన సంతానాన్ని తన జాతిని తరాల తరబడి ఉంచుకోవడానికి
ప్రయత్నిస్తుంది. అందుకే జీవుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ (reproductive
system) ఉంది. మామూలు నాటు కోడి ప్రకృతి సిద్ధమైనదే
కానీ,
ఫారం (poultry) కోడి అలాంటిది కాదు.
జన్యు సాంకేతిక ప్రక్రియ (genetic engineering)ను,
ప్రకృతి సిద్ధమైన పద్ధతులకు సంధానించగా ఏర్పడినది. అవి గర్భం
నుంచే పుడతాయి కానీ వాటి గుడ్లను పొదిగితే పిల్లలు రావు. కారణం వీటి గుడ్లలో ఫలదీకరణం
చెందిన అండం ఉండదు. ఆడ, మగ కోళ్లు జతగూడడం వల్ల
కాకుండా ప్రత్యేక పద్ధతిలో సేకరించిన శుక్రద్రవాన్ని ఫారం కోడి పెట్టలకు ఇంజెక్ట్
చేస్తారు. అందువల్లనే వీటిలో జీవం ఉండదు. కేవలం తెల్ల సొన, పచ్చసొనలతో కూడిన ప్రొటీనే ఉంటుంది. అందుకే వీటిని కేవలం శాకాహారమనే
అంటారు. మరి ఇలా ఎందుకు చేస్తారు? మామూలు కోడి గుడ్డును
నిలవ ఉంచితే తినడానికి పనికిరాదు. అదే ఫారం కోడిగుడ్డయితే పరిమిత ఉష్ణోగ్రత వద్ద ఎంత
కాలం నిలవ ఉంచినా ఏమీ కాదు.