ధనుష్ హీరోగా
రూపొందిన ద్విభాషా చిత్రం ‘సార్’. తమిళంలో ‘వాతి’ టైటిల్‌తో తెరకెక్కింది. మలయాళ నటి
సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి ఈ ద్విభాషా చిత్రాన్ని
డైరెక్ట్ చేశారు. టాలీవుడ్‌కు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన సితార ఎంటర్‌టైన్మెంట్స్
బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
(ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్
సంగీతం సమకూర్చారు. తమిళంలో ఈ పాటను హీరో ధనుష్ స్వయంగా రాశారు. ‘వా వాతీ’ అంటూ సాగే
ఈ పాట తెలుగు వెర్షన్‌ను సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రచించారు.
------------------------------
పల్లవి
శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే
సీతకుమల్లే నీతో అడుగేసే మాటడిగిందే
నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే
అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే
ఇంకపైనా నీకు నాకు ప్రేమ పాఠాలే..
మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు
అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు
మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు
అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు
చరణం
ఏ వైపు పోనీవె నన్ను కాస్తయినా..
ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా..
ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా..
చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా
గుండెపై అలా నల్లపూసలా
వంద ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా..
ఒంటి పేరుతో ఇంటి పేరుగా
జంటగా నిను రాయాలంటున్నా..
మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు
అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు
మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు
అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు