Song: Gelupu thalupule
Lyricist: Rehman
Singers: Sri Rama Chandra
Music : Mani sharma
Gelupu Thalupule
Song Lyrics - Teenmaar Songs Telugu - Pawan Kalyan, Trisha, Mani Sharma
గెలుపు తలుపులే
తీసే
ఆకాశమే నేడు నా
కోసమే
అడుగు మెరుపులా
మారే
ఆనందమే వీడదీ
బంధమే
ఎటువైపూ వెలుతున్నా
వెలుగుల్నే చూస్తున్నా
మెరిసావే రంగుల్లోనా
కల తీరే సమయానా
అల నేనై లేస్తున్నా
అనుకుందే చేసేస్తున్నా
దారులన్ని నాతో
పాటుగా
ఊయలూగి పాటే పాడగా
నను వీడి కదలదు
కాలమొక క్షణమైనా
గెలుపు తలుపులే
తీసే
ఆకాశమే నేడు నా
కోసమే
ఎదలో ఆశలన్నీ
ఎదిగే కళ్ళ ముందరే
ఎగిరే ఊహలన్నీ
నిజమై నన్ను చేరెలే
సందేహమేది లేదుగా
సంతోషమంత నాదిగా
చుక్కల్లో చేరి
చూపగా
ఉప్పొంగుతున్న
హోరుగా చిందేసి పాదమాడగా
దిక్కుల్ని మీటి
వీణగా
చెలరేగి కదిలెను
గాలి తరగలే పైనా
గెలుపు తలుపులే
తీసే
ఆకాశమే నేడు నా
కోసమే
అలుపే రాదు అంటూ
కొలిచా నింగి అంచులనే
జగమే ఏలుకుంటూ
పరిచా కోటి కాంతులే
ఇవ్వాల గుండెలో
ఇలా చల్లారిపోని శ్వాసలా
కమ్మేసుకుందే
నీ కలా
ఇన్నాళ్ళు లేని
లోటులా తెల్లారిపోని రేయిలా
నన్నల్లుకుంటె
నువ్విలా
నను నేను గెలిచిన
ఒంటరిగా నిలిచానే
గెలుపు తలుపులే
తీసే
ఆకాశమే నేడు నా
కోసమే