SELF
ASSESSMENT TERM 2 MODEL PAPER - 2024 - 2025
Class: 4 :: Subject:
Telugu :: Total Marks: 50
సెక్షన్ - A : బహుళైచ్ఛిక ప్రశ్నలు
ప్రతి
ప్రశ్నకి 4 ఎంపికలు
ఉంటాయి. ఆ ఎంపికలలో ఒక ఎంపిక మాత్రమే సరైన సమాధానమవుతుంది. 15 x 2 =30 M
1.
కింది వాక్యంలో గీతగీసిన పదానికి సమానార్థక పదాన్ని
గుర్తించండి.
ఈ రోజు సభ లో అతని మాటలకి
చప్పట్లు కొట్టారు.
·
A) రచ్చబండ
·
B) కొలువు
·
C) పంచాయితీ
·
D) గ్రామ
·
సమాధానం: [B] కొలువు
2. కింది వాక్యంలో
గీతగీసిన పదానికి బహువచన పదాన్ని గుర్తించండి.
ప్రతి బట్టను దారంతో
నేస్తారు.
·
A) దారులు
·
B) దొరలు
·
C) దారాలు
·
D) దొరువులు.
·
సమాధానం: [C] దారాలు
3. కింది వాక్యంలోని
ఖాళీని సరైన పదంతో పూరించండి.
పిల్లలకి రేగుపళ్ళు, శనగలు, చెరకుముక్కలు, చిల్లరడబ్బులు, బంతిపూలు
కలిపి వేసే రోజు...
·
A) ఏకాదశిరోజు
·
B) కనుమరోజు
·
C) భోగిపండుగ రోజు
·
D) మకరసంక్రాంతి రోజు
·
సమాధానం: [C] భోగిపండుగ రోజు
4. కింది వాక్యంలోని
ఖాళీలను సరైన ద్విత్వాక్షర పదాలతో పూరించండి
...... ... మీద .............
చీమలు పాకుతున్నాయి.
·
A) చక్కెర, చక్రము
·
B) చక్కెర, చిట్టి
·
C) చెట్టు, పూలు
·
D) చక్కెర, చెలిమి
·
సమాధానం: [B] చక్కెర, చిట్టి
5. కింది పదానికి ఒకే అర్థం వచ్చే ఇతర పదాలు గుర్తించండి. 'ధనం'
·
A) డబ్బు, సబ్బు
·
B) డాబు, గర్వం
·
C) చిల్లర, నోటి
·
D) డబ్బు, సంపద
·
సమాధానం: [D] డబ్బు, సంపద
5. కింది వాక్యంలోని
నామవాచకాలను గుర్తించండి.
రామాపురంలో రాజు అనే
పిల్లవాడు ఉండేవాడు. అతనికి గర్వం ఎక్కువగా ఉండేది.
·
A) పిల్లవాడు, అతనికి
·
B) రామాపురం, రాజు
·
C) ఎక్కువగా, రాజు
·
D) ఉండేవాడు, ఉండేది
·
సమాధానం: [B] రామాపురం, రాజు
7. ఈ కింద ఇవ్వబడిన గేయ పాదాల యొక్క సరైన భావాన్ని గుర్తించండి. "చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్ అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్"
·
A) దేశ ప్రజలందరూ అన్నదమ్ముల వలే కలిసి ఉండాలి.
·
B) దేశప్రజలందరూ మతం కోసం పోట్లాడుకోవాలి.
·
C) దేశ ప్రజలందరూ రోజూ నడవాలి.
·
D) చెట్టు పుట్టలను కొట్టకూడదు.
·
సమాధానం: [A] దేశ ప్రజలందరూ అన్నదమ్ముల వలే
కలిసి ఉండాలి.
8. కింది వాక్యంలోని ఖాళీని సరైన క్రియాపదంతో పూరించండి.
ప్రవల్లిక నాట్యం................
·
A) చేశాడు.
·
B) తిన్నది.
·
C) గీసింది.
·
D) చేసింది.
·
సమాధానం: [D] చేసింది.
9. “సింధూజ పాట పాడుతున్నది." అనే వాక్యం యొక్క భూతకాల రూపాన్ని
గుర్తించండి.
·
A) సింధూజ పాట పాడింది.
·
B) సింధూజ పాట పాడబోతున్నది.
·
C) సింధూజ పాట పాడుతూనే ఉన్నది.
·
D) సింధూజ పాట చక్కగా పాడుతున్నది.
·
సమాధానం: [A] సింధూజ పాట పాడింది.
10. కింది వాటిలో విశేషణ పదాలు ఏవి ?
1.
సన్నగా 2. రవి 3. అతను 4.
నడుచు
·
A)
1, 2, 3, 4
·
B) కేవలం 2 మాత్రమే
·
C) కేవలం 1 మాత్రమే
·
D)
2, 3, 4
·
సమాధానం: [C] కేవలం 1 మాత్రమే
11. రవి : " గలగల, బిరబిర” అనే ఈ పదాలను అనుకరణ
పదాలు అంటారు.
జమున : కాదు. వాటిని ప్రాస పదాలు అంటారు. వీరి
ఇద్దరిలో ఎవరు చెప్పినది సరైనది ?
·
A) జమున
·
B) రవి
·
C) ఇద్దరూ చెప్పినవి సరైనవే
·
D) ఇద్దరూ చెప్పినవి తప్పు. అవి తమాషా పదాలు మాత్రమే
·
సమాధానం: [B] రవి
12. కింది చిత్రానికి సరైన వాక్యాన్ని గుర్తించండి.
·
A) పార్వతీశం ఒట్టి చేతులతో పరిగెడుతున్నాడు.
·
B) పార్వతీశం చేతులలో సంచులతో నడుస్తున్నాడు.
·
C) పార్వతీశం చేతిలో అనేక సంచులతో నిల్చున్నాడు చిక్క
·
D) పార్వతీశం ఒట్టి చేతులతో నిల్చున్నాడు.
·
సమాధానం: [B] పార్వతీశం చేతులలో సంచులతో
నడుస్తున్నాడు.
పఠనావగాహన (గద్యం)
కింద
ఇచ్చిన గద్యం చదివి, ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. ఆమె కస్తూరిబా. మోహన్ దాస్ కరమ్చంద్
గాంధీ గారి భార్య. ఆమె ఏమీ చదువుకోలేదు, ఆడంబరాలకు పోయే
మనిషి కాదు. కానీ ఆమెది బలమైన వ్యక్తిత్వం. దేనికి భయపడేది కాదు. ఆమె సాదాసీదా
జీవనానికి, దయాగుణానికి ప్రజలు ఆమెను ప్రేమించేవారు. స్వాతంత్య్ర
పోరాటంలో, నిరసన ప్రదర్శనలలో, సత్యాగ్రహాలలో
ఆమె అతడికి గట్టి ఆధారం. అతడి ప్రపంచానికి ప్రశాంత కేంద్రం ఆమె, ఆమె మద్దతు లేకపోతే గాంధీజీ అన్ని విజయాలు సాధించగలిగేవాడు కాదు. ఆమె చాలా
గట్టిమనిషి, ధైర్యవంతురాలు. గాంధీలాగే ఆమె దేశం కోసం ఎంతో
త్యాగం చేసింది. స్వాతంత్ర్య సమరయోధురాలిగా ఆమె అనేక నిరసన ప్రదర్శనలను ముందు ఉండి
నడిపించింది. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నది. జైలుకి వెళ్లింది.
13. ఈ కింది వాటిలో ఏది కస్తూరిబా కి సంబంధించి సరైనది కాదు ?
·
A) ఆమె ఏమీ చదువుకోలేదు.
·
B) కస్తూరిబా దేనికీ భయపడేది కాదు.
·
C) ఆమె ఆడంబరాలకి పోతుంది.
·
D) ఆమెకి దయాగుణం ఉంది.
·
సమాధానం: [C]
14. కస్తూరిబా పోరాట నైపుణ్యానికి ఉదాహరణగా ఏ సంఘటనను పేర్కొనవచ్చు ?
·
A) బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన స్వంత పార్టీని స్థాపించారు.
·
B) బ్రిటీష్ అధికారులతో శాంతి చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకున్నారు.
·
C) గాంధీజీ ఆదేశాలను పాటిస్తూ వెనకుండి సహాయపడ్డారు.
·
D) సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని, లాఠీదెబ్బలు తిని,
జైలుకు వెళ్లారు.
·
సమాధానం: [D]
15. కస్తూరిబాపై ప్రజలు ప్రేమ చూపించుటకు కారణం ఏమిటి?
·
A) ఆమె సాదాసీదా జీవనం, దయాగుణం
·
B) ఆమె రాజకీయ నాయకురాలు కావడం
·
C) ఆమె భర్త మహాత్మాగాంధీ అని
·
D) ఆమె చదువుకున్న స్థాయి
·
సమాధానం: [A]
సెక్షన్ - B
మీ
జవాబు పత్రంలో ఈ కింది ప్రశ్నకు సమాధానం రాయండి.
16. కింద ఇచ్చిన చిత్రం గురించి సొంతమాటలలో రెండు వాక్యాలు రాయండి.
సమాధానం:
·
పిల్లలు పార్కులో ఆడుకుంటున్నారు.
·
ఇద్దరు పిల్లలు సైకిలుపై వెళ్తున్నారు.
సెక్షన్ - C
మీ జవాబు పత్రంలో ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు
రాయండి.
17. ఈ క్రింది పదాలకు అర్ధములు రాసి, సొంతవాక్యాలు
రాయండి.
1.
మోము = ముఖము
· సొంతవాక్యం: మంచి మార్కులు రావడంతో పిల్లల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి
2.
తిలకించడం = చూడడం
·
సొంతవాక్యం: నేను సినిమా చూశాను..
18.
"బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ!"
పై
పద్యానికి భావాన్ని రాయండి. అలాగే బలవంతుడు ఎందుకు గర్వంతో విర్రవీగకూడదో తెలపండి.
·
సమాధానం: నేను బలవంతుణ్ణి అనే గర్వంతో అందరినీ
ఎదిరించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఎంత బలమతుడైనా కొన్ని సమయాల్లో తన కంటే బలహీనుల
చేతుల్లో ఓడిపోయే అవకాశం ఉంది.
19. కింద ఇవ్వబడిన ప్రతి గేయపంక్తిని సరిచేసి రాయండి.
రక్తంబు రాజు వర్షించు చేతి కత్తి
·
సరిచేసిన వాక్యం: రాజు చేతి కత్తి రక్తంబు వర్ణించు
2.
గురియు చేతి కలము సుధలు సుకవి
·
సరిచేసిన వాక్యం: సుకవి చేతి కలము సుధలు గురియు
3.
యావత్ప్రపంచంబు ఆతడేలగలుగు
·
సరిచేసిన వాక్యం: అతడేల గలుగు యావత్ప్రపంచంబు
4.
పరము నీత డేలగలుగు ఇహము
·
సరిచేసిన వాక్యం: నిహము పరము నీత డేలగలుగు
సెక్షన్ - D
మీ జవాబు పత్రంలో ఈ క్రింది ప్రశ్నకు సమాధానం రాయండి.
20. మీరు చేసిన ఒక ప్రయాణం గురించి ఆరు వాక్యాలు రాయండి. మీరు ఏ రోజున ఊరు
వెళ్లారు ? ఎవరెవరు వెళ్లారు ? ఏ
వాహనంలో వెళ్లారు ? ఏ యే ప్రదేశాలను చూశారు ? చూసినపుడు మీకు ఎలా అనిపించింది ? వంటి వివరాలతో
రాయండి.
·
సమాధానం: నేను విజయవాడకు మా అమ్మ, నాన్నతో కలసి బస్సులో
దసరా రోజున వెళ్ళాము. దుర్గ ఆలయంను చూశాము. చాలా ఆనందంగా అనిపించింది.
.png)
.png)
Social Plugin