Type Here to Get Search Results !

5th Class Telugu – SA2 Model Question Papers

      Class 5 Telugu SELF ASSESSMENT TERM 2 MODEL PAPER - 2024 - 2025


సెక్షన్ - A : బహుళైచ్ఛిక ప్రశ్నలు

ప్రతి ప్రశ్నకి 4 ఎంపికలు ఉంటాయి మరియు ఆ ఎంపికలలో ఒక ఎంపిక మాత్రమే సరైన సమాధానమవుతుంది. (15 x 2 = 30)

1. ఈ కింది వాక్యంలో గీతగీసిన పదాలకి సరైన అర్థాన్ని గుర్తించండి.

     యువకులు ఉత్సాహంగా  ముందుకెళ్ళి ప్రజల సమస్య తీర్చారు.

·         A) నిర్వీర్యులు

·         B) నడిచివెళ్ళి

·         C) కదంతొక్కి

·         D) రౌద్రముగా

·         సమాధానం: [C]

2. ఈ కింది వాక్యంలోని సర్వనామాన్ని గుర్తించండి

అరకు వ్యాలీ చాలా అందమైన ప్రదేశం. అది ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది.

·         A) అందమైన

·         B) అది

·         C) చల్లగా

·         D) ఉంటుంది

·         సమాధానం: [B]

3. కింది వాక్యం చదివి, విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి.

హనుమంతుడు, రాముని యొక్క దూతగా లంకకు వెళ్ళాడు.

·         A) దూతగా

·         B) వెళ్ళాడు

·         C) యొక్క

·         D) రాముడు

·         సమాధానం: [C]

4. ఈ కింది వాక్యాన్ని సరైన క్రియతో పూరించండి.

మొన్న వారం చెప్పిన పాఠం నిన్ననే ..., రేపు వెళ్ళి, ఆ పాఠం మీద జరగబోయే పరీక్ష రాస్తాను.

·         A) చదువుతాను

·         B) చదువుతున్నాను

·         C) చదువుతాను

·         D) చదివాను

·         సమాధానం: [D]

5. కింది వాక్యంలో కర్త, కర్మలను గుర్తించండి.

మోహన్ కోలాటం ఎంతో సంతోషంగా చేశాడు.

·         A) మోహన్, చేశాడు

·         B) మోహన్, కోలాటం

·         C) కోలాటం, సంతోషంగా

·         D) మోహన్, ఎంతో

·         సమాధానం: [B]

6. కింద ఇచ్చిన గేయ పాదాలకి సరిపోయే వాక్యము ఏది?

"ఈఏటి నీటిలో క్రమ్మదనము

దోసిట నొక్కమారు పుక్కిలించిన చాలు

నీ పుట్టువునకు, సార్థకత్వమ్ము నిష్కల్మషత్వ మబ్బు !

ఇంతమంది కన్నతల్లి ఎందుకిట్లు మారెనో?

ఇంతమంచి పెన్న తల్లి ఎందుకెండి పోయెనో?"

·         A) ఎండిపోయిన ఏరు గురించిన బాధ

·         B) కన్న తల్లి సరిగా చూసుకోలేదని బాధ

·         C) ఏరుకు గల స్వార్థం గురించిన బాధ

·         D) కమ్మని అమ్మచేతి ప్రతి వంట ఇచ్చిన సంతోషం

·         సమాధానం: [A]

7. శ్రీహరి తరగతిలో అందరికంటే బాగా చదివేవాడు. రవి మొదట్లో అస్సలు చదివే వాడుకాదు. మోహన్తో స్నేహం చేసిన కొద్దిరోజుల్లోనే రవి బాగా చదవడం మొదలుపెట్టాడు. పై సందర్భానికి సరిపోయే సామెత ఏమిటి?

·         A) ఆవలిస్తే పేగులు లెక్కపెట్టినట్టు.

·         B) తొంభై ఆమడలైనా వెళ్లి తోలుబొమ్మలాట చూడాలి.

·         C) మొక్కై వంగనిది మానై వంగునా.

·         D) ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు.

·         సమాధానం: [D]

8. కింద ఇవ్వబడిన కవితను చదివి, అందులోని ప్రాస పదాలను గుర్తించండి.

ఆటలో మా పరుగులు శతకం

గురి తప్పక సాధించాము పతకం

·         A) తప్పకుండా - శతకం

·         B) శతకం - పతకం

·         C) పరుగులు - పతకం

·         D) ఆట - గురి

·         సమాధానం: [B]

9. ఈ కింది వాటిలో సంక్లిష్ట వాక్యాన్ని గుర్తించండి.

·         A) రాజు పాఠం చదివి, అన్నం తిని, నిద్రపోయాడు.

·         B) ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు, రేపు వస్తాడు.

·         C) పాప పాలు తాగుతున్నది.

·         D) వాడు మా తమ్ముడు.

·         సమాధానం: [A]

10. ఈ కింది వాటిలో “హోరు” పదమును ఉపయోగించి చెప్పిన అర్ధవంతమైన వాక్యం ఏది?

·         A) జాతర హోరుకి అబ్దుల్ మాటలు తన తల్లి హసీనాకు వినబడలేదు.

·         B) రమ్య పెన్సిల్ కిందపడి పెద్ద హోరు చేసింది.

·         C) మమ్మల్ని ఈ కత్తి హోరు నుండి రక్షించండి.

·         D) ఎవ్వరినీ ఎవ్వరూ హోరు చేసుకోవద్దు.

·         సమాధానం: [A]

11. “జయగీతం” పాఠంలోని ఈ కింది గేయ పాదాలు ఎవరిని కీర్తిస్తున్నవి?

జయ మానవ మందారా!

జయభారత భాస్కరా!

నవ భారత సంవిధాన

ధర్మ పథక నిర్మాతా!

భువి సమస్త పీడిత జన

దుఃఖశాంతి తథాగతా!

·         A) సుభాష్ చంద్రబోస్

·         B) అంబేద్కర్

·         C) గాంధీ

·         D) నెహ్రూ

·         సమాధానం: [B]

12. మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో, రెండవ వాక్యం ఆ పదంతోనే ప్రారంభమవడాన్ని ముక్తపదగ్రస్తం అంటారు. ఆ ప్రకారం కింది వాక్యం ఏ పదంతో మొదలవుతుంది?

సెలయేటి దరి నొక్క చెంగల్వ బాట

బాట వెంటనే పోతే పువ్వుల్ల తోట

తోటలో ఒక పెద్ద దొరలుండు కోట

కోటలో రతనాలు కూర్చిన పీట

...పై రాణుల్ల ప్రియమైన ఆట

·         A) సెలఏటి

·         B) కోటి

·         C) బాట

·         D) పీట

·         సమాధానం: [D]


పఠనావగాహన (సంభాషణ)

కింది ఇచ్చిన సంభాషణ చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.

విలేఖరి: మీ పేరు ఏమిటి?

అమ్మాయి: నా పేరు పుష్పరాణి, నా వయసు 10 సంవత్సరాలు.

విలేఖరి: మీరు "సాహస బాలల పురస్కారం" అందుకున్న సంఘటన ఎప్పుడు జరిగింది?

అమ్మాయి: ఇది అక్టోబర్ 10, 2004న జరిగింది. నేను నా తమ్ముడు మహేష్‌ని పిలవడానికి వెళుతున్నప్పుడు జరిగింది.

విలేఖరి: మీరు వెళ్తున్నప్పుడు ఏం చూశారు?

అమ్మాయి: మేము గ్రామంలోని చెరువు దగ్గర నుంచి వెళుతుండగా, ఒక పిల్లవాడు చెరువుకు ఉత్తరం వైపు మునిగిపోతూ పెద్దగా అరుస్తున్నాడు. అక్కడ చాలా లోతుగా ఉంది. నాకు ఈత బాగా వచ్చు. దాంతో నేను ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా నీటిలో దూకి, పిల్లవాడిని రక్షించి, ఒడ్డుకు తీసుకువచ్చాను.

విలేఖరి: మీ జీవితాన్ని పణంగా పెట్టి కాపాడటం ద్వారా మీరు ధైర్యానికి ఒక ఉదాహరణగా నిలిచారు. మీరు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు?

అమ్మాయి: నేను వైద్యురాలిని కావాలనుకుంటున్నాను.

విలేఖరి: ఎందుకు?

అమ్మాయి: నేను ప్రజల ప్రాణాలను రక్షించాలనుకుంటున్నాను.

విలేఖరి: తప్పకుండా, మీకు శుభాకాంక్షలు.

13. అమ్మాయిని విలేఖరి ఎందుకు కలుసుకున్నాడు?

·         A) అమ్మాయి స్నేహితుల గురించి తెలుసుకోవడానికి.

·         B) అమ్మాయి తమ్ముడి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి.

·         C) అమ్మాయి వాళ్ళ అమ్మా - నాన్న గురించి తెలుసుకోవడానికి.

·         D) అమ్మాయి చేసిన సాహసం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి.

·         సమాధానం: [D]

14. పుష్ప ఎవరిని రక్షించింది?

·         A) ఆమె అన్నయ్యను రక్షించింది.

·         B) ఆమె స్నేహితురాలిని రక్షించింది.

·         C) ఆమె ఒక బాలుడిని రక్షించింది.

·         D) ఆమె మిత్రుడిని రక్షించింది.

·         సమాధానం: [C]

15. పుష్ప ఎందుకు డాక్టర్ కావాలనుకుంది?

·         A) ఆమె ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుకుంటోంది.

·         B) ఆమె చాలా డబ్బు సంపాదించాలనుకుంటుంది.

·         C) ఆమెకు చాలా గౌరవం కావాలి.

·         D) ఆమెకి ఏ నిర్ధిష్ట కారణం లేదు.

·         సమాధానం: [A]


సెక్షన్ - B

మీ జవాబు పత్రంలో ఈ క్రింది ప్రశ్నకు సమాధానం రాయండి. (1 x 2 = 2)

16. కింది పేరాను చదివి, రెండు ప్రశ్నలు తయారు చేయండి.

ఒక అడవిలో ఒక దొంగ బుద్ధి గల తోడేలు కలదు. ఒక రోజు దానికి అడవంతా వెతికినా ఆహారం దొరకలేదు. దానికి ఆకలితో కడుపు నకనకలాడసాగింది. పోతా పోతా ఉంటే దానికి ఒక చెట్టుకొమ్మ మీద కోడి కనిపించింది. ఎలాగైనా దానిని మోసం చేసి తినాలని అనుకుంది.

·         ప్రశ్నలు:

1.        పై పేరాలో ఉన్న తోడేలు ఎలాంటిది?

2.      తోడేలుకు చెట్టు కొమ్మ మీద ఏమి కనిపించింది?


సెక్షన్ - C

మీ జవాబు పత్రంలో ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (3 x 4 = 12)

17. ఈ కింది వాక్యాలు చదివి, వాటి ఆధారంగా భాషాభాగాలను పట్టికలో రాయండి.

వేంగమాంబను సామాజిక కట్టుబాట్లు అనుసరించేటట్లు చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆమె చాలా కష్టాలు పడింది.

·         నామవాచకం: వేంగమాంబ

·         సర్వనామం: ఆమె

·         విశేషణం: చాలా

·         క్రియ: జరిగాయి, పడింది, చేయడానికి

18. "చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని గీడు సేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ ! వినురవేమ !" పై పద్యం భావాన్ని రాయండి. అలాగే శత్రువుకి ఎందుకు ఉపకారం చేయాలో మీ సొంతమాటలలో రాయండి.

మనకు ఎంత పెద్ద శత్రువైనా, అతనికి హాని చేయకూడదు. అతను మన చేతిలో పడినా కూడా అతనికి కీడు చేయడం మంచిది కాదు. దానికి బదులుగా అతనికి మంచి చేసి పంపించడం గొప్ప లక్షణం. ఇదే నిజమైన మహానుభావుల గుణం

శత్రువుకి ఎందుకు ఉపకారం చేయాలి? (సొంత మాటల్లో)

శత్రువుకి ఉపకారం చేయడం మన గొప్ప మనసును చూపిస్తుంది.
అలా చేస్తే శత్రువు కూడా మారి మన మిత్రుడిగా మారవచ్చు.
కోపం, ద్వేషం తగ్గి ప్రేమ పెరుగుతుంది.
సమాజంలో శాంతి మరియు సౌహార్దం పెరుగుతాయి.
కాబట్టి శత్రువుకి కూడా మంచి చేయడం మనకు గౌరవం తెస్తుంది.

 

19. ఈ కింది వాక్యాలు భూత కాలంలో ఉన్నాయి. వాటి వర్తమాన మరియు భవిష్యత్తు కాల వాక్యాలు రాయండి. (1 x 6 = 6)

భూతకాలం

వర్తమాన కాలం

భవిష్యత్ కాలం

ప్రియ సినిమా చూసింది.

ప్రియ సినిమా చూస్తుంది

ప్రియ సినిమా చూడబోతుంది..

విశ్వం బడికి వెళ్ళాడు.

విశ్వం బడికి


సెక్షన్ - D

మీ జవాబు పత్రంలో ఈ కింది ప్రశ్నకు సమాధానం రాయండి.

20. వేసవి సెలవులకి మీరు మీ బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ మీరు గమనించిన అంశాలని వివరిస్తూ మీ మిత్రునికి ఒక లేఖ రాయండి

 

కు

ప్రియ మిత్రుడు రాహుల్‌కు,

నమస్కారం. నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. నువ్వు కూడా క్షేమంగా ఉన్నావని ఆశిస్తున్నాను.

 

ఈ వేసవి సెలవుల్లో నేను మా బంధువుల ఇంటికి వెళ్లాను. వారి ఊరు చాలా అందంగా ఉంది. అక్కడ చుట్టూ పచ్చని పొలాలు, చెట్లు ఉన్నాయి. ఉదయం పక్షుల కిలకిలారావాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

 

అక్కడి ప్రజలు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. నేను వాళ్లతో కలిసి ఆటలు ఆడాను. సాయంత్రం సమయాల్లో బయట తిరిగి, ప్రకృతి అందాలను ఆస్వాదించాను. మా బంధువులు నాకు ఎంతో ప్రేమతో చూసుకున్నారు. రుచికరమైన వంటకాలు చేసి పెట్టారు.

 

ఈ ప్రయాణం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఈ సెలవులు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

 

నువ్వు కూడా ఒకసారి మా బంధువుల ఊరికి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది.

 

ఇంతటితో ఆపుతున్నాను. త్వరలో కలుద్దాం.

 

నీ మిత్రుడు,

[మీ పేరు]


Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages