3rd
Class Telugu SELF
ASSESSMENT TERM 2 MODEL PAPER - 2024 - 2025
సెక్షన్ - A : బహుళైచ్ఛిక ప్రశ్నలు
ప్రతి ప్రశ్నకి 4 ఎంపికలు ఉంటాయి. మరియు ఆ ఎంపికలలో ఒక
ఎంపిక మాత్రమే సరైన సమాధానమవుతుంది.
1. ఈ చిత్రంలోని
అమ్మాయి దేనితో ఆడుకుంటున్నది ?
- A) పిల్లి
- B) కుక్క
- C) ఎలుక
- D) కుందేలు
- సమాధానం: [A]
2. కింద ఇచ్చిన
అక్షరాలతో ఏర్పడిన అర్థవంతమైన పదాన్ని గుర్తించండి. థ హా క స్య
- A) హాథకస్య
- B) హాస్యథక:
- C) హాస్యకథ
- D) హాకస్యథ
- సమాధానం: [C]
3. కింది వాక్యాన్ని
సరైన నామవాచక పదంతో పూరించండి. గౌతమి ... కొరకు పుస్తకాలు కొన్నది
- A) పవిత్ర
- B) అతని
- C) స్నేహం
- D) ఆమె
- సమాధానం: [A]
4. ఈ క్రింది పొడుపు
కథకు సరైన సమాధానం గుర్తించండి. చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం
తియ్యగనుండు'
- A) సరస్సు
- B) బావి
- C) టెంకాయ
- D) గోడ
- సమాధానం: [C]
5. “ముత్యము” అనేది
ఏ రకమైన పదము ?
- A) ద్విత్వాక్షర పదం
- B) ప్రాసపదం
- C) జంటపదం
- D) భ్రమక పదం
- సమాధానం: [D]
6. ఈ క్రింది
వాక్యములోని ఖాళీని సరైన సర్వనామ పదముతో పూరించండి. అమ్మ నన్ను నూనె
తీసుకురమ్మన్నది. అందుకే ... తీసుకువచ్చాను.
- A) మనము
- B) నేను
- C) మాకు
- D) నాకు
- సమాధానం: [B]
7. కింద ఇచ్చిన
పదానికి సరైన బహువచన పదాన్ని గుర్తించండి.
- A) కళ్ళు
- B) కాళ్ళు
- C) కాలురు
- D) కాలాలు
- సమాధానం: [B]
8. ఈ క్రింది
వాక్యంలో తప్పుగా వ్రాయబడిన పదాన్ని గుర్తించండి. శ్రవణ్ పాఠశాలకి ప్రతిరోజూ
సుభ్రంగా రావడానికి ప్రయత్నం చేస్తాడు.
- A) పాఠశాల
- B) ప్రయత్నం
- C) చేస్తాడు
- D) సుభ్రం
- సమాధానం: [D]
9. కింది వాక్యములో
గీతగీసిన పదానికి అర్థమును గుర్తించుము. కమలములు కమలాప్తుని వలన వాడిపోతాయి
- A) చంద్రుడు
- B) సూర్యుడు
- C) ఇంద్రుడు
- D) వాయుదేవుడు
- సమాధానం: [B]
10. కింది వాటిలో
ప్రశ్నార్ధకం ఉన్న వాక్యాన్ని గుర్తించండి.
- A) నువ్వు ఎలా ఉన్నావు?
- B) నువ్వు చాలా బాగున్నావు.
- C) నువ్వు, నేను
కలసి ఆడుదాము.
- D) అబ్బో! నువ్వు చాలా
గొప్పవాడివి.
- సమాధానం: [A]
11. కింది వాక్యాలలో
'స్వల్ప విరామం' ఉన్న వాక్యాన్ని
గుర్తించండి.
- A) రాముడు మంచి బాలుడా?
- B) రాముడు మంచి బాలుడు.
- C) రాము, జగ్గు
మంచి స్నేహితులు.
- D) ఆహా! రాముడు ఎంత మంచి బాలుడో!
- సమాధానం: [C]
12. చిత్రానికి
సరిపోయే వాక్యాన్ని గుర్తించండి.
- A) అబ్బాయి చదువుతున్నాడు.
- B) అబ్బాయి గీస్తున్నాడు.
- C) అబ్బాయి తింటున్నాడు.
- D) అబ్బాయి రాస్తున్నాడు.
- సమాధానం: [A]
పఠనావగాహన (గద్యం)
కింద ఇచ్చిన కథ చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు
గుర్తించండి:
ఒకసారి ఐదు కప్పలు తమలో తాము ఒక
పోటీ పెట్టుకున్నాయి. తమ ముందు కనిపించే ఎత్తైన పర్వతం మొట్టమొదట అధిరోహించిన వారు
విజేత అని అనుకున్నాయి. అడవిలో ఉన్న అన్ని జీవులు ఈ పోటీని చూడడానికి చాలా ఆసక్తి
చూపించాయి. కుందేలు ఈల వేసి పోటీ ప్రారంభించింది. ఐదు కప్పలూ గెంతుతూ ముందుకు
కదులుతున్నాయి. నక్క, ఏనుగు, సింహం మరియు ఇతర ప్రాణులు ఈ దృశ్యం చూస్తూ
నవ్వుతున్నాయి. అవి అన్ని కప్పలతో, “మీరు కేవలం కప్పలు. మీరు
ఎత్తైన పర్వతంపైకి ఎలా ఎక్కగలరు?" అప్పుడు కూడా కప్పలు
ఎగురుతూ ముందుకు వెళ్ళసాగాయి. కొంత సేపటికి ఒక కప్ప అలసటతో ఆగిపోయింది. అంతలోనే
మరో రెండు కప్పలు కూడా ఆగిపోయాయి. అతికష్టం మీద పర్వతం పైకి ఎక్కే నాలుగో కప్ప
అధిక ఆయాసంతో ఊపిరి అందక అక్కడే స్పృహ తప్పింది. చివర ఉన్న కప్ప ఇప్పటికీ
పర్వతాన్ని ఎక్కుతూ ఉంది. అది జంతువుల హేళనలు వినిపించుకోలేదు. పర్వతం కొనకు
చేరడానికి గెంతుతూ ముందుకు సాగుతున్నది. "ఇప్పుడు అలసిపోతుంది, ఆగిపోతుంది" అని జంతువులు చెప్పుకోసాగాయి. కానీ కప్ప చివరికి పర్వతం
పైకి చేరుకుంది. అన్ని జంతువులు నిశ్శబ్దంగా నిలిచాయి. అడవిలో జయజయ ధ్వనులు
మిన్నునంటాయి. ఒక చిన్న కప్ప పర్వతం యొక్క శిఖరాగ్రానికి చేరుకుని విజేతగా
నిలిచింది.
13. పోటీ ఎవరి మధ్య
ఏర్పాటు చేయబడింది?
- A) ఐదు కప్పల మధ్య
- B) రెండు కప్పల మధ్య
- C) కప్ప మరియు జింకల మధ్య
- D) నక్క మరియు ఏనుగుల మధ్య
- సమాధానం: [A]
14. ఈ కథ నుండి మనం
ఏం తెలుసుకోవాలి?
- A) ఎవరితో పోటీ పెట్టుకోరాదు.
- B) రోజూ ఎత్తైన పర్వతాలు ఎక్కాలి.
- C) ఎవరైనా హేళన చేస్తే మన పనిని
మానుకోవాలి.
- D) ఎంతమంది అపహాస్యం చేసినప్పటికీ
ధైర్యం కోల్పోకూడదు.
- సమాధానం: [D]
15. పోటీ ఎప్పుడు
ప్రారంభం అయింది?
- A) ఏనుగు తొండం ఆడించినప్పుడు.
- B) కుందేలు ఈల వేసినప్పుడు.
- C) నక్క జెండా ఊపినప్పుడు.
- D) కప్ప గెంతినప్పుడు.
- సమాధానం: [B]
సెక్షన్ - B
మీ జవాబు పత్రంలో ఈ క్రింది
ప్రశ్నకు సమాధానం రాయండి.
16. కింది వాక్యాలలో
ద్విత్వాక్షర పదాలను గుర్తించి, రాయండి.
1) మేకపిల్ల
పొలంలోని గడ్డిని తింటూ ఉంది.
2) కొమ్మల్లో
రెక్కలు గల పక్షి ఉంది.
సెక్షన్ - C
మీ జవాబు పత్రంలో ఈ క్రింది
ప్రశ్నలకు సమాధానాలు రాయండి. $3\times4=12$
17. ఈ క్రింది
పదాలకు అర్థాలు రాసి, సొంతవాక్యాలు రాయండి.
- ఇచ్చకములు
- అర్థం: ప్రియమైన మాటలు
- సొంత వాక్యం: ప్రియమైన మాటలు అందరికీ నచ్చుతాయి.
- ఐకమత్యం
- అర్థం: కలిసి ఉండటం
- సొంతవాక్యం: నేను వళ్ళడూ అందరితో కలిసి ఉంటాను .
18. ఈ క్రింది
పొడుపు కథలకి సరైన జవాబులు గుర్తించి రాయండి.
(పెదవులు, సూర్యుడు, చందమామ, గడియారం,
సామెత, పొడుపుకథ)
- రోజుకో ఆకారం మారుస్తాడు, చివరకు నిండు సున్నా అవుతాడు - చందమామ
- ఒకరు పొడుస్తారు, ఒకరు విడుస్తారు - పాడుపు కథ
- ఉన్న చోటే ఉంటుంది, వేళా పాళా చెపుతుంది - గడియారం
- అమ్మంటే దగ్గరకొచ్చి నాన్నంటే దూరంగా పోతాయి - పెదవులు
19. ఈ క్రింది పద్యం
యొక్క భావాన్ని మీ సొంత మాటలలో రాయండి.
'బహుళ కావ్యములను పరికింపగా వచ్చు
బహుళ శబ్దచయము పలుకవచ్చు
సహన మొక్కటబ్బ చాల
కష్టంబురా
విశ్వదాభిరామ
వినురవేమ!'
- సమాధానం : ఓ వేమా! అనేక శకాల గ్రంథాలను చదివి ఉండవచ్చు.
ఎన్నో మాటలు మాట్లాడి ఉండవచ్చు. కాని ఓర్పు కలిగి ఉండడం అనేది చాలా కష్టమైన
పని. అందువల్ల అందరూ ఓర్పును అలవరచు కోవాలి.
సెక్షన్ - D
మీ జవాబు
పత్రంలో ఈ క్రింది ప్రశ్నకు సమాధానం రాయండి.
20. కింద ఇచ్చిన
చిత్రాన్ని గురించి అర్థవంతమైన మూడు వాక్యాలు రాయండి.
సంక్రాంతి పండుగ బాగా జరుపుకుంటున్నారు.
భోగి మంటలు ఉన్నాయి.