Type Here to Get Search Results !

SA2 CLASS - 3 TELUGU kEY PAPER (2025-26)

 

SA2  CLASS - 3 TELUGU kEY PAPER

  (క్లాస్ 3 - టర్మ్ ప్రశ్నపత్రానికి ) సరైన సమాధానాలు కింద ఇవ్వబడ్డాయి.

  This is not Oficial Key.. 

విభాగము - A : బహుళైచ్ఛిక ప్రశ్నలు

1.      'అందరికీ చంద్రుడు అంటే చాలా ఇష్టం' ఈ వాక్యంలో ఉన్న చంద్రుడు అనే పదానికి గల మరొక పేరు ఏమిటి?

జవాబు: C) జాబిల్లి

2.      ఇంటికి వచ్చిన అతిథులను ఎలా ఆదరించాలి?

జవాబు: B) గౌరవించి మర్యాద చేయాలి

3.      వర్షం వస్తే వీధులన్నీ ఎలా ఉంటాయి?

జవాబు: D) బురదగా ఉంటాయి

4.      ఒక వాక్యం పూర్తి అయింది అంటే దాని చివర ఉండాల్సిన గుర్తును ఈ క్రింది వాటిలో గుర్తించండి.

జవాబు: A) వాక్యాంత బిందువు (.) / ఫుల్ స్టాప్

5.      ప్రతిరోజు చేసే పనులను ఏమంటారు?

జవాబు: B) దినచర్య

6.      నటించేవారు నటులు అయితే చిత్రాలు గీసేవారు

జవాబు: C) చిత్రకారులు

7.      "ఆకాశంలో ఎగురుతాను పక్షిని కాను, తోక ఉంటుంది కానీ కోతిని కాను”. నేనెవర్నో చెప్పండి?

జవాబు: D) గాలిపటం

8.      చెయ్యి పదానికి బహువచన పదాన్ని గుర్తించండి.

జవాబు: B) చేతులు

9.      కింది వాక్యంలో భ్రమకపదం/కచిక పదాన్ని గుర్తించండి. (యుద్ధంలో మడమతిప్పని వారిని వీరులు అంటారు)

జవాబు: B) మడమ (ముందు నుండి, వెనుక నుండి చదివినా ఒకేలా ఉండే పదం).

10.  అమ్మమ్మ నీతి కథ చెప్పింది (పై వాక్యంలోని క్రియా పదాన్ని గుర్తించండి)

జవాబు: D) చెప్పింది

11.  ఆకాశంలో హరివిల్లు అందంగా ఉంటుంది. (హరివిల్లు పదానికి సమానార్థం ఇచ్చే పదం)

జవాబు: B) ఇంద్రధనుస్సు

12.  'ప్రకాశం ఆనకట్టను' ఏ నదిపై నిర్మించారు?

జవాబు: C) కృష్ణానది

13.  షడ్రుచులు అంటే ఆరు రుచులు మరి సప్తవర్ణాలు అంటే ఎన్ని రంగులు?

జవాబు: A) ఏడు

14.  తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి. (సంయుక్తాక్షర పదాన్ని గుర్తించండి)

జవాబు: B) కవయిత్రి (వేర్వేరు హల్లులు కలిసి ఏర్పడిన అక్షరం త్రి).

15.  దేశంలోని ప్రజలందరూ అన్నదమ్ములవలె కలిసి జీవించాలి. (జంటపదాన్ని గుర్తించండి) జవాబు: B) అన్నదమ్ములు

 

పేరాగ్రాఫ్ ప్రశ్నలు (16 - 20):

16.  గురువు శిష్యులకు ఏమి ఇచ్చాడు?

జవాబు: B) కొంత సొమ్ము

17.  మొదటి శిష్యుడు గదిని ఎలా నింపాడు?

జవాబు: B) ఎండుగడ్డితో

18.  గురువు మొదటి శిష్యుని ప్రయత్నాన్ని ఎందుకు నిరుత్సాహంగా పరిగణించాడు?

జవాబు: C) నిరుపయోగంగా నింపాడు

19.  రెండవ శిష్యుని చర్య గురువుకు ఎందుకు నచ్చింది?

జవాబు: C) అతడు గదిని కాంతితో నింపాడు

20.  ఈ కథను బట్టి, మీరు ఒక చిన్న వనరుతో గదిని నింపాల్సి వస్తే, మీరు ఏమి చేస్తారు?

జవాబు: C) ఒక దీపం వెలిగిస్తాను


విభాగము - B : చిన్న సమాధాన ప్రశ్నలు

21. అక్షర చక్రం ఆధారంగా 4 పదాలు రాయండి:

  1. అన్న      2. చిన్న              3. నిన్న              4. కన్న

(మధ్యలో ఉన్న 'న్న' అక్షరంతో చుట్టూ ఉన్న అక్షరాలను కలిపి పదాలు చేయాలి).

22. ఖాళీలను పూరించండి:

1) చదువు సంధ్య నేర్పి గొప్పవాణ్ణి చేస్తానన్నాడు.

2) హార్మోనిస్టు ఖాదర్ ఒకరోజు మా ఇంటికి వచ్చారు.

3) గోగుపుల్ల గొట్టంతో శృతి గుక్క నేర్పించాడు.

4) స్కూల్లో ద్రోణవిజయం నాటకం ఆడాము.

23. క్రియాపదాల ఆధారంగా నాలుగు వాక్యాలు రాయండి:

  1. పాప పుస్తకం చదువుతూ ఉంది.
  2. నేను ప్రతిరోజూ పత్రిక చదువుతాను.
  3. అందరూ కలసి కథను చదివేశారు.
  4. వారు గ్రంథాలయంలో చదువుతూ ఉన్నారు.

24. వచనం మార్చి రాయండి (ఏకవచనం/బహువచనం):

  1. పండు - పండ్లు (లేదా పళ్ళు)
  2. తోరణాలు - తోరణం
  3. ఆటలు - ఆట
  4. కాయ - కాయలు

విభాగము - C : వ్యాసరూప/పట్టిక సమాధానాలు

25. పట్టిక ఆధారంగా 4 వాక్యాలు:

  1. నది గలగల పారింది.
  2. పాప పకపక నవ్వింది.
  3. వెండి తళతళ మెరిసింది.
  4. సీత చకచక నడిచింది.

26. పేరా ఆధారంగా జతపరచండి:

  1. నేలంతా - బురదగా మారింది
  2. ముసలమ్మ - వణుకుతూ నడుస్తుంది
  3. పాప - రోడ్డు దాటించింది
  4. అందరూ - అభినందించారు

27. ప్రాసపదాలు (Rhyming Words):

  • తరం - వరం, కరం
  • మెరుపు - అరుపు, తెలుపు
  • జలము - బలము, ఫలము
  • రాయడం - పాడటం, ఆడటం

28. సొంతమాటల్లో రాయండి:

  1. సహాయం: మనం ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి.
  2. పాటలు: మా బడిలో పిల్లలు అందంగా పాటలు పాడారు.

29. చిత్రం చూసి రెండు వాక్యాలు రాయండి: (చిత్రం ఆధారంగా)

  1. బాలుడు తల్లి కాళ్ళు మొక్కుతున్నాడు.
  2. బాలుడు మొక్కను నాటుతున్నాడు మరియు నాన్న బాలుడికి సహాయం చేస్తున్నాడు.

విభాగము - D : దీర్ఘ సమాధానాలు

30. A) బొమ్మకు బదులుగా పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి:

      1) నేను బస్సు లో ఊరికి వెళ్ళాను.

      2) అమల తలపై కిరీటంపెట్టుకుంది.

      3) రవికి  విమానం ఎక్కాలని కోరిక ఉంది.

     4) అడవికి సింహం రాజు.

(లేదా)

30. B) పద్యానికి భావం: దేశానికి సేవ చేయడమే దేవుని పూజించడంతో సమానం. కేవలం మన స్వార్థం చూసుకోవడం కంటే మరణం మరొకటి లేదు. ఇతరుల పట్ల దయ, సానుభూతి కలిగి ఉండటమే నిజమైన స్వర్గం. ఓ తెలుగు బాల! ఈ మంచి గుణాలను నీవు అలవర్చుకో.

31. A) పట్టికలోని పదాలను గుర్తించి రాయండి:


1. కాలం                  2. పొరుగూరు                 5. మేనత్త                       

4. కళ్ళు                    5. త్యాగం                       6. సాయం

7.పొద                    8. మాత

(లేదా)

31. B) 'పొడుపు కథలు' పదాలు జతపరచండి:

  1. పండ్లలో రాజు - మామిడి పండు
  2. వెండి గొలుసులు - ముగ్గు
  3. నల్లని విత్తనాలు - అక్షరాలు
  4. రెండు కాయలు - సూర్యుడు, చంద్రుడు

32. A) నచ్చిన చిన్న బొమ్మను గీసి, రంగులు వేసి 4 వాక్యాలు రాయండి: (విద్యార్థులు స్వయంగా చేయవలసిన పని. ఉదాహరణకు 'చెట్టు' గురించి:)

  1. ఇది ఒక చెట్టు బొమ్మ.
  2. చెట్లు మనకు ప్రాణవాయువును ఇస్తాయి.
  3. చెట్లు మనకు పండ్లను మరియు నీడను ఇస్తాయి.
  4. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.

(లేదా)

32. B) పదాల వరుస సరిచేసి అర్థవంతంగా రాయండి:

1) డబ్బా శనగలు రెండు రూపాయలు.

2) అమ్మాయి సబ్బుతో ముఖం కడిగింది.

3) అమ్మ అన్నం వండి పెట్టింది.

4) వనజ కొప్పులో మల్లెలు పెట్టింది.

33. A) మీకు ఇష్టమైన పండుగ గూర్చి రాయండి:

నాకు ఇష్టమైన పండుగ సంక్రాంతి. ఈ పండుగను మూడు రోజుల పాటు చాలా సంతోషంగా జరుపుకుంటాము. మొదటి రోజు భోగి మంటలు వేస్తాము. రెండవ రోజు మకర సంక్రాంతి నాడు పిండి వంటలు చేసుకుంటాము మరియు పతంగులు ఎగురవేస్తాము. మూడవ రోజు కనుమ పండుగను పశువుల పండుగగా జరుపుకుంటాము. ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేస్తాము.

(లేదా)

33. B) కింద ఇచ్చిన పదాలను పట్టికలో విభజించి రాయండి:

నామవాచకం సర్వనామం క్రియప్రశ్నార్థకం
సరళఆమెవెళ్ళిందిఎవరు
ఆవువారువచ్చిందిఎందుకు
పుస్తకంఅతడుచదివారుఏమిటి
పావురంఅవితిన్నాముఏది
సపోటా, పులిమేము 

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages