Type Here to Get Search Results !

అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం'

0

     
'అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం'
         ❈───────────❈
జూన్ 26వ తేదీని ప్రతి ఏటా 'అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం' గా (International Day Against Drug Abuse and Illicit Trafficking) ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

☛డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించడం మరియు వాటికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేయడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 1987 డిసెంబర్‌లో చేసిన తీర్మానం మేరకు, 1988 నుండి ప్రతి సంవత్సరం జూన్ 26న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

☛మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల ఆకలి తగ్గిపోతుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. నిద్రలో సమస్యలు, మానసిక ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, అందరితో పోట్లాటలు చేస్తారు. చేతులు, కాళ్ళు వణకడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. జుట్టు ఎండిపోతుంది, వయసు మీరిపోయినట్లు కనిపిస్తారు. మాటలో తడబాటు కలుగుతుంది. కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. కొంత మంది డ్రగ్స్ కొనుక్కోవడం కోసం దొంగతనాలు చేయడం కూడా మొదలుపెడతారని వైద్యులు చెబుతున్నారు.

☛ఎవరైతే మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తున్నారో వాళ్లకు దానివల్ల కలిగే ఇబ్బందులను తెలియజేయాలి. మాదకద్రవ్యాల వ్యసనం నుండి బయటపడడానికి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్లు, సపోర్టు గురించి బాధితులకు తెలియజేయాలి. యువతకు మాదక ద్రవ్యాల వాడకం మంచిది కాదని, అనేక వ్యసనాలకు దారితీస్తుందని తెలియజేయాలి.

☛చికిత్స మరియు పునరావాసానికి ప్రాప్యతను విస్తరించడం, ఆవిష్కరణ, సాంకేతికత మరియు అంతర్జాతీయ సహకారం ద్వారా అక్రమ మాదక ద్రవ్యాల రవాణాను ఎదుర్కోవడం పగడ్బందీగా నిర్వహించాలి.

☛2026వ సంవత్సరపు ఇతివృత్తం *“సంకెళ్లను తెంచడం: అందరికీ నివారణ, చికిత్స మరియు పునరుద్ధరణ"



   

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages