Type Here to Get Search Results !

AP 4th Class Telugu Workbook Solutions – 4. పరివర్తన (2026-27)

0
4 పరివర్తన
సాధనపత్రం 1
చదవడం - వ్యక్తపరచడం
అ) కింది పేరాను చదవండి. ప్రశ్నలకు సరైన జవాబులు రాయండి.
  • 1. సతీష్ తన సమయాన్ని మొదట ఎలా గడిపేవాడు?
    అ) చదువుతూ
    ఆ) సెల్‌ఫోన్ చూస్తూ
    ఇ) ఆడుకుంటూ
    ఈ) టి.వి.చూస్తూ
    Answer: ఈ) టి.వి.చూస్తూ
  • 2. చదువును అశ్రద్ధ చేయరాదు. ఈ వాక్యంలో గీత గీసిన పదానికి వ్యతిరేక పదాన్ని రాయండి.
    జ. శ్రద్ధ
  • 3. సతీష్ తన తప్పులు తెలుసుకొని ఏం చేశాడు?
    జ. సతీష్ టి.వి చూడడం తగ్గించి, శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడు. మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు.
  • 4. సతీష్‌ను చివరికి తల్లితండ్రులు మెచ్చుకున్నారు కదా! మీ తల్లితండ్రులు కూడా మిమ్మల్ని మెచ్చుకోవాలంటే మీరు ఎలా ప్రవర్తిస్తారు?
    జ. తల్లిదండ్రుల మాట విని, సమయానికి బడికి వెళ్లి శ్రద్ధగా చదువుకుంటాను. మంచి అలవాట్లను పాటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటాను.
ఆ) పాఠం ఆధారంగా ఈ మాటలు ఎవరు, ఎవరితో అన్నారో రాయండి.
  • 1. "బాబూ! రాము. చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళుతున్నారు. నువ్వు కూడా త్వరగా తయారై బడికి వెళ్ళు.”
    జ. అమ్మ, రాముతో అంది.
  • 2. "అయ్యో! బాబు. రానున్నది వానాకాలం. అసలే నాకు గూడు లేదు.”
    జ. కాకి, రాముతో అంది.
  • 3. “తేనెటీగ, తేనెటీగ. మనం ఆడుకుందామా!”
    జ. రాము, తేనెటీగతో అన్నాడు.
  • 4. "నాకు అంత తీరిక లేదు బాబు! పూలనుండి తేనెను సేకరిస్తున్నాను.”
    జ. తేనెటీగ, రాముతో అంది.
  • 5. "బాబూ! ఇది నేను గింజలు సేకరించుకునే కాలం."
    జ. చీమ, రాముతో అంది.
సాధనపత్రం 2
చదవడం - వ్యక్తపరచడం
అ) కింది గేయాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
  • 1. పడవ ఉయ్యాలగా మారినప్పుడు ఏమయ్యింది?
    అ) తేలింది
    ఆ) ఆడింది
    ఇ) మునిగింది
    ఈ) ఊగింది
    Answer: ఈ) ఊగింది
  • 2. పై గేయంలో పడవను ఎన్ని రకాలుగా వర్ణించారు?
    జ. పడవను మూడు రకాలుగా (హంస, చేప, ఉయ్యాలగా) వర్ణించారు.
  • 3. కాగితంతో ఎన్ని రకాల పడవలు చేయవచ్చు?
    జ. కాగితంతో సాధారణ పడవ, తెరచాప పడవ, డబుల్ పడవ, స్టీమర్ పడవ వంటి అనేక రకాల పడవలు చేయవచ్చు.
  • 4. వర్షపు నీటిలో మీరెప్పుడైనా పడవలు వదిలి ఆడుకున్నారా? అప్పుడు మీకు ఎలా అనిపించింది?
    జ. అవును, ఆడుకున్నాను. కాగితపు పడవలు నీటిలో తేలుతూ వెళుతుంటే చూడటానికి ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా అనిపించింది.
  • 5. అలలమీద తేలేటి హంస కదా నా పడవ.
ఆ) కింది సంభాషణ చదవండి. ప్రశ్నలు తయారుచేయండి.
  • 1. పుస్తకం దేని కోసం ఎదురు చూస్తోంది?
    జ. ఎవరైనా తనను చదువుతారేమోనని పుస్తకం ఎదురు చూస్తోంది.
  • 2. ఎవ్వరూ వదలకుండా దేనిని చూస్తున్నారు?
    జ. ఎవ్వరూ వదలకుండా సెల్‌ఫోన్‌ను చూస్తున్నారు.
  • 3. అందరికీ విజ్ఞానాన్ని ఏది పంచుతుంది?
    జ. అందరికీ విజ్ఞానాన్ని పుస్తకం పంచుతుంది.
సాధనపత్రం 3
పదజాలం
1) పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి. గడులలో రాయండి.
  • సరళాక్షరాలు:
    జ, త, ల, ప, డ, చ, న, వ, ట
  • పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి: ఉదా: జలజ
    తల, లత, పలక, డమరుకం, చదరంగం, నగ, వల, టపాసు
  • సొంత వాక్యం:
    పిల్లలు పలకపై బలపంతో అక్షరాలు రాస్తున్నారు.
2. పేరాలోని గుణింత అక్షరాలను గుర్తించండి. గడులలో రాయండి.
  • గుణింత అక్షరాలు:
    రా, తీ, గా, బా, నా, పో, తో, చూ, డే
  • పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి: ఉదా: రాగిజావ
    తీపి, గాలి, బావి, నావ, పోటీ, తోట, చూపు, డేగ
  • సొంత వాక్యం:
    మా ఇంటి ముందు అందమైన పూలతోట ఉన్నది.
3. పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి. గడులలో రాయండి.
  • ద్విత్వాక్షరాలు:
    క్క, మ్మ, ట్ట, ల్ల, ప్పు
  • పై అక్షరాలు ఉండేలా పదాలు రాయండి: ఉదా: చక్కెర
    అక్క, అమ్మ, చెట్టు, పిల్లి, తప్పు
  • సొంత వాక్యం:
    అమ్మ చూపించే ప్రేమ వెలకట్టలేనిది.
4. పై పేరాలోని సంయుక్తాక్షర పదాలను రాయండి. వాటితో సొంత వాక్యాలను రాయండి.
  • సంయుక్తాక్షర పదాలు:
    తల్లితండ్రులు, విద్యార్థి, డాక్టరు
  • సొంత వాక్యాలు:
    1. తల్లితండ్రులు: మనం తల్లితండ్రులను ఎల్లప్పుడూ గౌరవించాలి.
    2. విద్యార్థి: విద్యార్థి శ్రద్ధగా చదువుకోవాలి.
    3. డాక్టరు: డాక్టరు రోగులకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడుతారు.
సాధనపత్రం 4
పదజాలం
అ) అంత్యాక్షరంతో పదాలను తయారుచేయండి.
  • గది → దినం → నలత → తరగతి → తిలకం → కమలం → లత
ఆ) కింది పదాలు చదవండి. జతపరచండి. ఏవైనా రెండు పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి.
A Ans B
1. గలగల ( b ) a. నడవడం
2. చకచక ( a ) b. సెలయేరు
3. పకపక ( d ) c. ఏడవడం
4. వలవల ( c ) d. నవ్వడం
  • వాక్యాలు:
    ఉదా|| బుజ్జాయి పకపక నవ్వుతున్నది.
    1. సెలయేరు గలగల పారుతున్నది.
    2. రాము బడికి చకచక నడిచి వెళ్లాడు.
    3. చిన్నారి వలవల ఏడుస్తున్నది.
ఇ) కింది పదాలను చదవండి. వేరుగా ఉన్నవాటి కింద గీత గీయండి.
  • 1. కాకి, కోయిల, పాము, పిచ్చుక
    జ. పాము (మిగిలినవి పక్షులు, పాము సరీసృపం)
  • 2. బొద్దింక, చీమ, ఈగ, ఏనుగు
    జ. ఏనుగు (మిగిలినవి కీటకాలు, ఏనుగు జంతువు)
  • 3. కుక్క, పిల్లి, దోమ, గేదె
    జ. దోమ (మిగిలినవి జంతువులు, దోమ కీటకం)
  • 4. గులాబి, టమాట, బెండకాయ, పొట్లకాయ
    జ. గులాబి (మిగిలినవి కూరగాయలు, గులాబి పువ్వు)
ఈ) మీరు చూసిన ఏవైనా మూడు పూలమొక్కల పేర్లను రాయండి.
  • ఉదా॥ గులాబి మొక్క
    1. మల్లె మొక్క
    2. మందార మొక్క
    3. చామంతి మొక్క
సాధనపత్రం 5
స్వీయరచన
కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
  • 1. పాఠంలోని పక్షి పేరేమిటి?
    జ: పాఠంలోని పక్షి పేరు కాకి.
  • 2. మీకు తెలిసిన రెండు పూల పేర్లను రాయండి.
    జ: 1. గులాబీ 2. మల్లెపువ్వు.
  • 3. కాకి, చీమ, తేనెటీగల ద్వారా ఏమి గ్రహించారు?
    జ: చిన్న జీవులైన కాకి, చీమ, తేనెటీగలు సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి పనిచేస్తున్నట్లే, మనం కూడా కాలాన్ని వృథా చేయకుండా మన పనిని మనం శ్రద్ధగా చేయాలని గ్రహించాము.
  • 4. రాము వెళ్ళిన మామిడి తోట ఎలా ఉంది?
    జ: మామిడి తోట నీళ్ల గలగలలు, పక్షుల కిలకిలలు, రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతితో ఎంతో ఆహ్లాదంగా ఉంది.
  • 5. కాలాన్ని ఎందుకు వృధా చేయకూడదు?
    జ: గడిచిన కాలం తిరిగి రాదు. చిన్నతనంలోనే సమయాన్ని సద్వినియోగం చేసుకొని చదువుకుంటేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలం. అందుకే కాలాన్ని వృథా చేయకూడదు.
  • 6. నువ్వే రాము అయితే ఏం చేస్తావు?
    జ: నేనే రాము అయితే బద్దకాన్ని వదిలిపెట్టి, సమయానికి బడికి వెళ్లి గురువులు చెప్పే పాఠాలను శ్రద్ధగా నేర్చుకుంటాను.
సాధనపత్రం 6
భాషాంశాలు
అ) కింది వాక్యాలలో సరైన చోట ( . ! ? ) గుర్తులు ఉంచండి.
  • 1. అబ్బో ఇది ఎంత పెద్ద చిత్రమో
    జ. అబ్బో! ఇది ఎంత పెద్ద చిత్రమో!
  • 2. నువ్వు నిన్న బడికి ఎందుకు రాలేదు
    జ. నువ్వు నిన్న బడికి ఎందుకు రాలేదు?
  • 3. వనజ తోటకు వెళ్ళింది
    జ. వనజ తోటకు వెళ్ళింది.
  • 4. సంచిలో పెన్సిల్ బాక్స్ స్కేలు రబ్బరు ఉన్నాయి
    జ. సంచిలో పెన్సిల్ బాక్స్, స్కేలు, రబ్బరు ఉన్నాయి.
  • 5. పాఠశాల నుండి నువ్వు ఎన్ని గంటలకు ఇంటికి వస్తావు
    జ. పాఠశాల నుండి నువ్వు ఎన్ని గంటలకు ఇంటికి వస్తావు?
  • 6. అమ్మో ఎంత బలవంతుడో
    జ. అమ్మో! ఎంత బలవంతుడో!
ఆ) కింది పదాలలో నామవాచకాలను గుర్తించి వాక్యాలు రాయండి.
  • నామవాచకాలు: సముద్రం, ఆంధ్రప్రదేశ్, పరుగుపందెం, పంట
    1. సముద్రం: విశాఖపట్నంలో అందమైన సముద్రం ఉంది.
    2. ఆంధ్రప్రదేశ్: మన రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్.
    3. పరుగుపందెం: మా బడి ఆటల పోటీల్లో నేను పరుగుపందెంలో గెలిచాను.
    4. పంట: వర్షాలు సమృద్ధిగా కురిస్తే పంట బాగా పండుతుంది.
ఇ) కింది వాక్యాలలో నామవాచకాలు, సర్వనామాలు గుర్తించండి.
  • 1. కుక్క విశ్వాసం గల జంతువు. అది ఇంటికి కాపలా కాస్తుంది.
    నామవాచకం: కుక్క, జంతువు | సర్వనామం: అది
  • 2. సూరయ్య పొలానికి వెళ్ళాడు. అతడు అరక దున్నాడు.
    నామవాచకం: సూరయ్య, పొలం, అరక | సర్వనామం: అతడు
  • 3. సవిత పాఠశాలకు వెళ్ళింది. ఆమె పాఠాలు బోధించింది.
    నామవాచకం: సవిత, పాఠశాల, పాఠాలు | సర్వనామం: ఆమె
ఈ) కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
  • 1. కింది వానిలో నామవాచకం కానిది గుర్తించండి.
    అ) పుస్తకం
    ఆ) అమరావతి
    ఇ) వారు
    ఈ) సంచి
    Answer: ఇ) వారు
  • 2. రాజు, రాధిక, నేను కలిసి ఆటలు ఆడుకున్నాము. వాక్యంలో సర్వనామం:
    జ. నేను
  • 3. అమ్మ వంట చేసింది. అది చాలా రుచిగా ఉంది. 'అది' దేని బదులుగా వాడారు?
    జ. 'వంట' బదులుగా వాడారు.
సాధనపత్రం 7
భాషాంశాలు
అ) కింది పేరాను చదవండి. నామవాచక, సర్వనామ పదాలను గుర్తించండి. పట్టికలో రాయండి.
నామవాచకాలు Ans (సర్వనామాలు)
పూర్ణిమ, బొమ్మలు, జెండా, సూర్యుడు, జంతువులు, బాలు, ఇల్లు, కారు, గుర్రం, పాఠశాల, పోటీలు, బహుమతులు, ఉపాధ్యాయులు, అనిత, తనూజ, రాఘవ, కాగితం, పెన్సిలు ఆ అమ్మాయి, వాటికి, ఆ అబ్బాయి, వారు, వారికి, వారిని, వారి, మాకు, మీరు
ఆ) కింది వాక్యాలను సర్వనామం ఉపయోగించి రాయండి.
  • ఉదా : మురళి బజారుకు వెళ్ళాడు. మురళి దుస్తులు కొన్నాడు.
    జ. మురళి బజారుకు వెళ్ళాడు. అతడు దుస్తులు కొన్నాడు.
  • 1. సరళ ముగ్గులు వేసింది. సరళ ముగ్గులకు రంగులు వేసింది.
    జ. సరళ ముగ్గులు వేసింది. ఆమె ముగ్గులకు రంగులు వేసింది.
  • 2. సింహం అడవికి రారాజు. సింహం జంతువులను వేటాడుతుంది.
    జ. సింహం అడవికి రారాజు. అది జంతువులను వేటాడుతుంది.
  • 3. రమేష్, రమణి చదువుకున్నారు. రమేష్, రమణి పరీక్ష ఉత్తీర్ణులయ్యారు.
    జ. రమేష్, రమణి చదువుకున్నారు. వారు పరీక్ష ఉత్తీర్ణులయ్యారు.
ఇ) కింది వాక్యాలలో సర్వనామం కాని దానిని గుర్తించండి.
  • అ) నేను
    ఆ) మీరు
    ఇ) వారు
    ఈ) నీరు
    Answer: ఈ) నీరు
సాధనపత్రం 8
సృజనాత్మకత
అ) కింది చిత్రాలను చూసి, కథను ఊహించి రాయండి. (నక్క - కొంగ కథ)
  • కథ:
    ఒక అడవిలో నక్క, కొంగ స్నేహంగా ఉండేవి. ఒకరోజు నక్క కొంగను తన ఇంటికి విందుకు పిలిచింది. అది వెడల్పాటి పళ్లెంలో పాయసం వడ్డించింది. నక్క చకచకా నాకేసింది కానీ, కొంగ పొడవైన ముక్కు వల్ల పాయసం తాగలేకపోయింది. నక్క కొంగను చూసి ఎగతాళిగా నవ్వింది.

    కొన్ని రోజులకు కొంగ నక్కను తన ఇంటికి విందుకు ఆహ్వానించింది. కొంగ సన్నని, పొడవైన మెడగల కూజాలో పాయసం వడ్డించింది. కొంగ సులభంగా తన ముక్కుతో పాయసం తాగింది కానీ, నక్క మూతి కూజాలోకి పోక పాయసం తాగలేక ఆకలితో ఉండిపోయింది. తన తప్పు తెలుసుకున్న నక్క సిగ్గుతో తలదించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది.

    నీతి: ఇతరులకు అపకారం తలపెడితే తిరిగి మనకే అపకారం జరుగుతుంది.
  • ఆ) చుక్కలు కలిపి చిత్రాన్ని గీసి, దానికి రంగులు వేయండి. చిత్రానికి పేరు పెట్టండి.
    చిత్రం పేరు: సీతాకోకచిలుక
సాధనపత్రం 9
నేనేమి నేర్చుకున్నాను?
1. గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి.
  • అమ్మ ఐస్‌క్రీం కొనివ్వలేదని చందన చిన్నబుచ్చుకుంది.
    అ) సంతోషపడింది
    ఆ) మొహమాట పడింది
    ఇ) నిరాశపడింది
    ఈ) ఆలోచించింది
    Answer: ఇ) నిరాశపడింది
  • 2. మీకు తెలిసిన కొన్ని పక్షుల పేర్లను రాయండి.
    జ. కాకి, పిచ్చుక, నెమలి, రామచిలుక, పావురం, కోకిల, గద్ద, కొంగ.
  • 3. కింది పేరాలో ( . ! ? ) చిహ్నాలను సరైన చోట ఉంచండి.
    జ. నేను బీచ్‌కు వెళ్ళాను. అక్కడ ఎన్నో రకాల పడవలు, గవ్వలు, చేపలు, పీతలు కనిపించాయి. అబ్బో! ఎంత పెద్ద పెద్ద అలలో! సముద్రం ఎంత పెద్దదిగా ఉందో అని ఆశ్చర్యపోయాను. మీరెప్పుడైనా సముద్రాన్ని చూశారా?
4. కింది పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
  • i. పై పేరాలో ఎవరెవరు ఏ వృత్తులు చేస్తుంటారో రాయండి.
వృత్తి Ans (చేసే పని)
1. డాక్టర్లు వైద్యం
2. రైతులు ఆహారధాన్యాలు పండించడం / వ్యవసాయం
3. గురువులు విద్యాబుద్ధులు నేర్పించడం / బోధన
4. పోలీసులు ప్రజలకు భద్రత కల్పించడం
5. సైనికులు దేశాన్ని కాపాడడం / రక్షణ
  • ii. సైనికులు చేసే పని ఏమిటి?
    1) దేశాన్ని కాపాడడం
    2) వైద్యం చేయడం
    3) పాఠాలు చెప్పడం
    4) వ్యవసాయం చేయడం
    Answer: 1) దేశాన్ని కాపాడడం
  • 5. క్రమశిక్షణతో మెలగాలంటే ఎలా ఉండాలి? రెండు వాక్యాలు రాయండి.
    1. సమయపాలన పాటిస్తూ పెద్దల మాట వినాలి.
    2. మన పనులను మనం బాధ్యతగా, సక్రమంగా పూర్తి చేయాలి.
  • 6. చిత్రంలోని పదాల ఆధారంగా రెండు వాక్యాలు రాయండి.
    ఉదా : రవి పాఠశాలకు వెళ్తాడు.
    1. రాణి నాట్యం చేస్తుంది.
    2. రవి జపము చేస్తాడు. (లేదా రాణి వంట చేస్తుంది.)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages