23 ఏళ్ళ వయ్యస్సులోనే భరత మాత దాస్య శృంకలాలను తెంచడానికి ఉరి కొయ్యను ముద్దాడి బలిదానం చేసిన అమర వీరుడు (షహీద్) "సర్దార్ భగత్ సింగ్" గారి జయంతి నేడు.. ఆ స్వాతంత్ర్యపోరాటయోధుడిని గుర్తుచేసుకుంటూ కొన్ని విషయాలు
- జననం : 28 సెప్టెంబర్ 1907 (బంగా, Jaranwala Tehsil, Lyallpur district, Punjab, British India (present-day Pakistan)
- మరణం : 1930 మార్చి 23 (వయసు 22) (Lahore, Punjab, British India (present-day Pakistan)
- సంస్థ : నవజవాన్ భారత సభ ,హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్కీ ,ర్తి కిసాన్ పార్టీ.
- ఉద్యమం : భారత స్వాతంత్ర ఉద్యమం
విప్లవం అంటే త్యాగం, త్యాగానికి కూడా పరిధి ఉంటుంది. కాని భగత్ సింగ్ దేశ స్వాతంత్యం కోసం 14 ఏళ్ల వయస్సులోనే జైలు జీవితం గడిపాడు. విప్లవ వీరుడిగా 24 సంవత్సరాల యవ్వన ప్రాయంలోనే అమరుడయ్యాడు. తెల్లదొరల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచాడు.
పంజాబ్‌లోని లాయల్‌పూర్ జిల్లా, బంగా సమీపంలోని ఖత్కర్ కలాన్ గ్రామంలో సర్దార్ కిషన్ సింగ్ మరియు విద్యావతి దంపతులకు జన్మించాడు భగత్ సింగ్. అతని కుటుంబసభ్యులు కూడా స్వాతంత్ర్య ఉద్యమంలోనూ, సైన్యంలో పనిచేయడం వలన చిన్నతనం నుండే దేశభక్తి భావాలను అలవర్చుకున్నాడు భగత్ సింగ్. అతని మూడేళ్ల వయస్సులో తన తండ్రితో కలసి బయటకు వెళ్లిన భగత్ సింగ్ పొలంలో ఆడుకుంటూ చిన్న చిన్న మొక్కలను పొలంలో నాటుతున్నాడు. గమనించిన తండ్రి ఏం చేస్తున్నావ్ అని సింగ్ ని అడగ్గా తుపాకులు నాటుతున్నా అన్న సమాధానం విన్న తన తండ్రి అతడిలో విప్లవ భావాలు నాటుకు పోయాయని ఆనాడే గమనించాడు. భగత్ సింగ్ బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉండేవాడు అతని భార్య హర్నామ్ కౌర్ ను చూసిన నాలుగేళ్ళ భగత్ సింగ్ " పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా" అని ప్రతిజ్ఞలు చేసేవాడు.
మహాత్మా గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణోద్యమానికి సింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన భగత్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు మరియు బ్రిటీషు దిగుమతి దుస్తులను తగులబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. ఉత్తరప్రదేశ్ లోని చౌరీ చౌరా గ్రామస్తులు పోలీసులను హింసాత్మకంగా హతమార్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని గాంధీ ఉపసంహరించుకున్నాడు. ఇది భగత్ సింగ్ కు నచ్చలేదు. గాంధీ అహింసావాదంపై అసంతృప్తి చెందిన సింగ్ యువ విప్లవోద్యమంలో చేరి, తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాడూ భగత్ సింగ్. బ్రిటీష్ ప్రభుత్వం 1928 లో భారత్ లోని వర్థమాన రాజకీయ పరిస్థితులపై నివేదిక కోరతూ సైమన్ కమీషన్ ను నియమించింది. కమీషన్ ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరశనలు చేపట్టారు. ఈ కమీషన్ లాహోర్ ను సందర్శించినప్పుడు లాలా లజిపతిరాయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీస్ లు హింశాత్మక పద్ధతిలో విచక్షణారహితంగా లజపతి రాయ్ ని లాఠీలతో కొట్టారు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన భగత్ సింగ్ ఆ పోలీస్ అధికారిని చంపాలని అనుకుని అతనికి బదులుగా మరో అధికారిని కాల్చిచంపడంతో పోలీసులు భగత్ సింగ్ ని అరెస్ట్ చేసి ఉరి తీయడానికి వేట మొదలు పెట్టారు. వారి నుండి తప్పించుకోవడానికి గుర్తు పట్టకుండా గడ్డాన్ని, వెంట్రుకలను కత్తిరించుకోవడం ద్వారా సిక్కు మత విశ్వాసాలను ఉల్లంఘించారు భగత్ సింగ్.
బ్రిటీష్ ప్రభుత్వం భగత్ సింగ్ లాంటి విప్లవ కారులను అణచివేయడానికి వ్యూహం పన్నింది. ఒక చట్టాన్ని తీసుకురావడం ద్వారా విప్లవకారులను అణచివేయవచ్చని ప్రత్యేక శాశనం కింద చట్టాన్ని ఆమోదించాలని భావించింది. అయితే సమావేశాల సమయంలో భగత్ సింగ్ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’అంటూ బాంబు విసిరారు . అయితే బాంబు పేలుడు కారణంగా ఏ ఒక్కరు మరణించడంగాని, గాయపడటం కాని జరగలేదు. అనంతరం తాము ఉద్దేశ్యపూర్వకంగానే ఈ పేలుడుకు వ్యూహం పన్నాం అని భగత్ సింగ్, మరో విప్లవకారుడు దత్ అంగీకరించి లొంగిపోయారు. వీరిని బ్రిటీస్ ప్రభుత్వం ‘జీవితకాల దేశ బహిష్కరణ’చేసింది.
పోలీస్ అధికారిని కాల్చిచంపడం, అసెంబ్లీలో బాంబు ఈ రెండు సంఘటనలపై పూర్తి విచారణ జరిపి 1931 మార్చి 23న భగత్ సింగ్ ని అతని అనుచరులను లాహోర్ లో ఉరితీసారు. ఉరితీసే సమయంలో జైలు లోపల నుంచి ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ నినదించారు భగత్ సింగ్. నేటికీ అతని త్యాగం చిరస్మరణీయం.