ఈ నెల 22 నుంచి అన్ని పాఠశాలల్లో ‘శిక్షా సప్తాహ్’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని Head masters కు ఆదేశాలు
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యావిధానం (NEP), 2020 ప్రవేశపెట్టి 4వ వార్షికోత్సవం
సందర్భంగా జూలై 22 నుండి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు *మండలము లోని అన్ని పాఠశాలల్లో*
‘శిక్షా సప్తాహ్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు.
జాతీయ నూతన విద్యా విధానం ప్రవేశపెట్టిన తర్వాత పరివర్తనాత్మక
సంస్కరణలపై , దేశవ్యాప్తంగా విద్యాభివృద్ధి చేయడంలో
నిబద్ధతను తెలియజేసేదిశగా ఈ కార్యక్రమం ఉద్ధేశమని తెలిపారు. ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు భాగస్వామ్యం
కావాలని కోరారు.
కార్యక్రమ వివరాలు
ఇలా:
శిక్షా సప్తాహ్
కార్యక్రమంలో భాగంగా వారంరోజులు చేపట్టాల్సిన విద్యాభివృద్ధికి సంబంధించిన అంశాల ప్రణాళిక
ఇదీ..
జూలై 22, 2024: ఉపాధ్యాయులు (TLM ) స్థానిక వనరులతో బోధన అభ్యసన సామాగ్రి తయారు చేసి ప్రదర్శించటం
జూలై, 23, 2024: పునాది అభ్యసన మరియు
సంఖ్యాశాస్త్రం నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి సమాజ భాగస్వాములకు అవగాహన కల్పించడం.
జూలై 24, 2024: క్రీడా దినోత్సవం- విద్యార్థులతో
క్రీడలు,
శారీరక సౌష్టవం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు క్రీడా పోటీలను
నిర్వహించడం.
జూలై 25, 2024: సాంస్కృతిక దినోత్సవం:
విద్యార్థుల్లో భిన్నత్వం లో ఏకత్వం భావాన్ని పెంపొందించడానికి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం
జూలై 26, 2024: సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం (స్కిల్ & డిజిటల్ ఇనిషియేటివ్ డే)
• ప్రస్తుత ఉద్యోగావకాశాల నేపథ్యంలో అన్ని తరగతి గది అనుభవాలను
మెరుగుపరచడానికి డిజిటల్ కార్యక్రమాలకు అవసరమయ్యే నూతన నైపుణ్యాల అవసరాన్ని గుర్తించడం.
• నైపుణ్య విద్య, సమర్థమైన మరియు
పోటీతత్వ వర్క్ ఫోర్స్‌ను నిర్మించడం.
• విద్యలో సాంకేతికత దివస్.
జూలై 27, 2024: పర్యావరణ పరిరక్షణ సంకల్ప
యాత్ర కృత్యాలు (మిషన్ లైఫ్ ఆక్టివిటీ స్) పాఠశాలలో పోషణ దినోత్సవ నిర్వహణ ( న్యూట్రిషన్
డే )
పాఠశాలల్లో కొత్త
ఎకో క్లబ్‌ల ఏర్పాటు, విద్యార్థులు, వారి తల్లులు మరియు మాతృభూమి మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి
*అమ్మ పేరుతో అమ్మతో కలిసి మొక్కలు నాటి అమ్మకి అంకితం కార్యక్రమం కింద కనీసం 35 మొక్కలు తల్లి
బిడ్డల తో కలిసి నాటించడం.
జూలై 28, 2024: సామాజిక భాగస్వామ్య
దినోత్సవం.
విద్యార్థుల సామాజిక
భావోద్వేగ శ్రేయస్సు కోసం స్థానిక ప్రజలు, తల్లిదండ్రుల కమిటీలు , తల్లిదండ్రులు
ఉపాధ్యాయ సంఘాలతో సహకారాన్ని పెంపొందించడం
మరియు నైపుణ్యాభివృద్ధికి పర్యావరణ వ్యవస్థను అందించడం (పుట్టిన రోజులు మరియు ప్రత్యేక
సందర్భాలలో (తిథి భోజనాలు) పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం
చేయడం