గ్రహాంతర వాసులు ఉన్నారో లేదో చెప్పడానికి నేటి విజ్ఞాన శాస్త్రం వద్ద కచ్చితమైన
ఆధారాలు లేవు. కానీ భూమి మీద ఉన్న పరిస్థితులు, పరిణామం (evelution) మరెక్కడైనా సంభవించి ఉంటే ఆ గ్రహాల మీద కూడా జీవం ఆవిర్భావానికి
అవకాశం లేకపోలేదు. ఆ జీవులు క్రమేణా పరిణామం చెంది ఉన్నత స్థాయి జీవులుగా మారే అవకాశం
కూడా ఉంటుంది. మన సౌరమండలంలో మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు లేవు. భూమికి సమీపంలో ఉన్న
మార్స్ (కుజ లేదా అంగారక) గ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోడానికి ఇటీవల పంపిన క్యూరియాసిటీ
రోవర్ అక్కడికి చేరుకోడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. సుమారు 20 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుజ గ్రహం మీదకు వెళ్లడానికే
ఇంతకాలం పడితే ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఎక్కడెక్కడో ఉండే సౌరమండలాలలోని గ్రహాల
మీది పరిస్థితులు ఎలాంటివో తెలియడానికి ఎన్నో వందల ఏళ్లు పడుతుంది. ఆయా గ్రహాల మీద
గ్రహాంతర వాసులెవరైనా ఉన్నా వాళ్లు భూమి దగ్గరకి రావడానికి కూడా అంతే కాలం పడుతుంది.
అది సాధ్యం కాదు. కాబట్టి గ్రహాంతర వాసులు ఎక్కడో అక్కడ ఉన్నా వారిని మనం చూడడం దాదాపు
అసంభవం.
Today's science has no conclusive evidence to say whether extraterrestrials exist or not. But if the conditions and evolution on earth had happened elsewhere , there would have been no possibility of life on those planets as well. There is also a possibility that those organisms will gradually evolve and become higher level organisms. There is no evidence of life anywhere else in our solar system. The recently sent Curiosity rover took almost a year to reach the near-Earth planet Mars (Mars or Mars). If it takes this long to go to the planet Mars, which is about 20 million kilometers away, it will take hundreds of years to know what the conditions are like on the planets in the solar system that are many light years away. If there are any aliens on the respective planets, it will take the same amount of time for them to come near the earth. That is not possible. So it is almost impossible for us to see aliens even if they are out there somewhere.