‘బేబీ’ సినిమా యూత్‌కి మత్తు ఇంజక్షన్‌లా ఎక్కేసింది. ముఖ్యంగా ఇందులోని
పాటలు మైండ్‌లోని నుంచి పోవట్లేదు సుమీ. ఈ మధ్య కాలంలో సినిమా పాటల్లో మళ్లీ మళ్లీ
వినిపించాలనేంత ఇష్టంగా మారాయి ‘బేబీ’ సినిమాలో పాటలు. ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ సాంగ్
అయితే గుండెల్ని పిండేస్తుంది. థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా ఈ పాటనే హమ్
చేస్తూ ఉన్నారంటే.. ఈపాట యూత్‌కి ఎంత బాగా నచ్చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సాంగ్ లిరిక్స్
మీకోసం.
O Rendu
Prema Meghaalila Song Lyrics - Baby Movie - Anand Deverakonda, Vijai Bulganin
ఏం మాయే ఇదీ..
ప్రాయమా
అరె ఈ లోకమే..
మాయమా
వేరే యే ధ్యాసా
లేదే.. ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే..
తుల్లె ఆశల్లో
ఇద్దరిదీ.. ఒకే
ప్రయాణంగా
ఇద్దరిదీ.. ఒకే
ప్రపంచంగా
ఆ ఇద్దరి.. ఊపిరి..
ఒకటయింది మెల్లగా.. మెల్లగా
ఓ రెండు ప్రేమ
మేఘాలిలా.. దూకాయి వానలాగా
ఆ వాన వాలు యే
వైపుకో.. తేల్చేది కాలమేగా
ఓ రెండు ప్రేమ
మేఘాలిలా.. దూకాయి వానలాగా
ఆ వాన వాలు యే
వైపుకో.. తేల్చేది కాలమేగా
చరణం:
తోచిందే.. ఈ జంట..
కలలకే.. నిజములా
సాగిందే దారంతా..
చెలిమికే.. రుజువులా
కంటీ రెప్ప కనుపాపలాగా..
ఉంటారేమో కడదాకా
సందమామా సిరివెన్నెలలాగా..
వందేళ్ళయినా విడిపోకా
ఓ రెండు ప్రేమ
మేఘాలిలా.. దూకాయి వానలాగా
ఆ వాన వాలు యేవైపుకో..
తేల్చేది కాలమేగా
ఓ రెండు ప్రేమ
మేఘాలిలా.. దూకాయి వానలాగా
ఆ వాన వాలు యే
వైపుకో.. తేల్చేది కాలమేగా
ఏం మాయే ఇదీ..
ప్రాయమా
అరె ఈ లోకమే..
మాయమా
వేరే యే ధ్యాసా
లేదే.. ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే..
తుల్లె ఆశల్లో
ఇద్దరిదీ.. ఒకే
ప్రయాణంగా
ఇద్దరిదీ.. ఒకే
ప్రపంచంగా
ఆ ఇద్దరి.. ఊపిరి..
ఒకటయింది.. మెల్లగా.. మెల్లగా