Type Here to Get Search Results !

Class- 4 Telugu Classroom Based Assessments-3 (SA - 2) (2023-24)

 Class- 4 Telugu  Classroom Based Assessments-3  (SA - 2) (2023-24)

 

సెక్షన్ A : బహుళైచ్ఛిక ప్రశ్నలు

ప్రతి ప్రశ్నకి 4 ఎంపికలు ఉంటాయి మరియు ఆ ఎంపికలలో ఒక ఎంపిక మాత్రమే సరైన సమాధానమవుతుంది.

(15 x 2M = 30M)

1. ఈ కింది వాక్యంలో గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి. యుద్ధభయం, వ్యాధిభయం లేకుండా ఉంటే <u>జగత్తు</u> అంతా సుభిక్షంగా ఉంటుంది.

·         A) దేశము

·         B) లోకము

·         C) ఊరు

·         D) రాష్ట్రము

2. ఈ కింది వాక్యంలో గీత గీసిన పదానికి సరైన వ్యతిరేక పదాన్ని గుర్తించండి. సూర్యుడు ఉదయాన్నే తూర్పు దిక్కున <u>ఉదయిస్తాడు</u>.

·         A) ప్రకాశిస్తాడు

·        
B) అస్తమిస్తాడు

·     
C) మెరుస్తాడు

·         D) సంచరిస్తాడు

3. ఈ క్రింది వాక్యంలో గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి. పిచ్చుక ఒక్కొక్క పుల్లతో ఎంతో <u>శ్రమించి</u> గూడు కట్టుకున్నది.

·         A) కష్టపడి

·         B) బాధపడి

·         C) ఇష్టపడి

·         D) వెంటపడి

4. ఈ క్రింది తారుమారైన సామెతల్లో సరైన సామెతను గుర్తించండి.

·         A) పెద్ద పామునైన కొట్టాలి చిన్నకర్రతో.

·         B) చిన్న కర్రతో కొట్టాలి పెద్ద పామునైన.

·         C) చిన్న పామునైన పెద్దకర్రతో కొట్టాలి.

·         D) కొట్టాలి చిన్న పాము నైనా పెద్దకర్రతో.

5. ఈ కింది వాక్యాలలో సరియైన చోట ఆశ్చర్యార్ధకం(!) ఉన్న వాక్యాన్ని గుర్తించండి.

·         A) ఆహా! ఇక్కడి వాతావారణం ఎంత బాగుందో!

·         B) సీతా ఇలారా ఈ పనిచెయ్యి!

·         C) బాబోయ్ ఇదెంత పెద్ద పామో!

·         D) అయ్యో నేను వేసిన ముగ్గు ఎవరు చెరిపారు!

6. క్రింది వాక్యంలో అనుకరణ పదాలను గుర్తించండి. నదిలో పారుతున్న నీళ్ల గలగలలు, పక్షుల రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది.

·         A) పారుతున్న, రెక్కల

·         B) గలగల, టపటప

·         C) నీళ్లు, పక్షులు

·         D) పచ్చని, ప్రకృతి

7. ఈ క్రింది వాక్యాలలో అసమాపక క్రియలను గుర్తించండి. నేను బడికి వెళ్ళి, పాఠాలు చదివాను. నా స్నేహితుడు వచ్చి, డబ్బు ఇచ్చాడు.

·         A) నేను, నా

·         B) బడికి, స్నేహితుడు

·         C) వెళ్ళి, వచ్చి

·         D) చదివాను, ఇచ్చాడు

8. ఈ కింది వాక్యంలో విశేషణ పదాన్ని గుర్తించండి. పండుగకి సుమ అరిసెలు కమ్మగా చేసింది.

·         A) సుమ

·         B) కమ్మగా

·         C) చేసింది

·         D) అరిసెలు

9. ఈ కింది వాక్యంలో గీత గీసిన పదానికి అదే అర్థం వచ్చే పదాలు గుర్తించండి. <u>ప్రపంచంలో</u> మనుషుల మధ్య మానవత్వం తగ్గిపోతుంది.

·         A) లోకం, జగత్తు

·         B) కాలం, సమయం

·         C) లోకం, ఆకాశం

·         D) విదేశం, స్వదేశం

10. "రాము అన్నం తిన్నాడు" అనే వాక్యం యొక్క భవిష్యత్తు కాలరూపాన్ని గుర్తించండి.

·         A) రాము అన్నం తినేశాడు.

·         B) రాము అన్నం తినలేదు.

·         C) రాము అన్నం తినబోతాడు.

·         D) రాము అన్నం తింటున్నాడు.

11. ఈ కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్ధాన్ని గుర్తించండి. విద్యార్థులు పుస్తకాలను <u>చిందరవందరగా</u> ఉంచుకోవడం మంచి లక్షణం కాదు.

·         A) పద్ధతిగా ఉండటం

·         B) మర్యాదగా ఉండటం

·         C) క్రమ పద్ధతిలో లేకుండా

·         D) సరైన విధంగా ఉండటం


పఠనావగాహన (సంభాషణ)

సంభాషణను విని, చదివి, కింది ప్రశ్నలకి జవాబులు ఇవ్వండి.

పిల్లలకు దసరా సెలవులు ఇచ్చారు. బడి అంతా కోలాహలంగా ఉన్నది. ఇంతలో కవిత టీచర్ అక్కడికి వచ్చింది.

·         పిల్లలు: నమస్కారం టీచర్!

·         టీచర్: నమస్కారం పిల్లలూ! రేపటి నుండి దసరా సెలవులు కదా! ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళుతున్నారు?

·         రమణ: సెలవుల్లో నేను మా అమ్మమ్మ వాళ్ల ఊరికి పోతా టీచర్!

·         దివ్య: మేము మా మమయ్య ఊరుకు పోతాం టీచర్! మేము దసరా పండుగ అక్కడనే జరుపుకుంటాం.

·         టీచర్: కరుణా! నువ్వు ఎక్కడికి వెళుతున్నావు?

·         కరుణ: ఈ సెలవులకు ఎక్కడికీ వెళ్లం టీచర్! కానీ మేము క్రిస్మస్ పండుగకు మా అమ్మమ్మ వాళ్లింటికి పోతాం. క్రిస్మస్ పండుగ బాగా జరుపుకుంటాం.

·         టీచర్: పిల్లలూ! చూశారా! మనకు ఎన్ని పండుగలు ఉన్నాయో?

·         పిల్లలు: పండుగల గురించి చెప్పండి టీచర్!

·         టీచర్: చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యమి కదా! ఆ రోజు వచ్చే పండుగనే “ఉగాది” అంటారు.

·         స్వప్న: అంటే మన తెలుగు వాళ్లందరికీ నూతన సంవత్సరం, 'హ్యాపీ న్యూ ఇయర్' అన్నమాట.

·         టీచర్: చాలా మంచిగ చెప్పావు స్వప్న. ఆరోజే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి కొత్త బట్టలు ధరించడం, తీపి వంటకాలు చేసుకోవడం, షడ్రుచులతో పచ్చడిని చేసుకోవడం, రాబోయే ఏడాదంతా ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం మొదలైనవి జరుపుకుంటాం. ఉగాది తరువాత తొమ్మిది రోజులకు, అంటే చైత్ర మాస శుద్ధ నవమి రోజున “శ్రీరామనవమి” ని జరుపుకుంటాం. ఇది శ్రీరాముని జన్మదినం. ఈ రోజున సీతారాముల కళ్యాణం చేసే సంప్రదాయం ఉన్నది.

12. చైత్ర శుద్ధ నవమి రోజున జరుపుకునే పండుగ పేరు ఏమిటి?

·         A) దసరా

·         B) ఉగాది

·         C) దీపావళి

·         D) శ్రీరామనవమి

13. క్రిస్మస్ పండుగను అమ్మమ్మ వాళ్ళింట్లో జరుపుకునే వారెవరు?

·         A) దివ్య

·         B) స్వప్న

·         C) రమణ

·         D) కరుణ

14. పంచాంగ శ్రవణం ఎప్పుడు నిర్వహిస్తారు?

·         A) ఉగాది

·         B) సంక్రాంతి

·         C) దీపావళి

·         D) శ్రీరామనవమి

15. చైత్రమాసంలో మొదటి తిథి పేరేమి?

·         A) విదియ

·         B) తదియ

·         C) పాడ్యమి

·         D) చవితి


సెక్షన్ B

కింది ప్రశ్నకు సమాధానం రాయండి. (1 x 2M = 2M)

16. ఈ క్రింది పదాలకు అర్థాన్ని రాయండి.

1.        ధ్వని = ______________________

2.      అంతరిక్షం = ______________________


సెక్షన్ C

మీ జవాబు పత్రంలో ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. (3 x 4M = 12M)

17. ఈ కింద ఇచ్చిన పదాన్ని సొంతవాక్యంలో ఉపయోగించి రాయండి.

1.        ఆశ్చర్యం : ______________________

2.      కంపించుట : ______________________

18. ఈ కింది గళ్ళ లోని అక్షరాల ఆధారంగా ఏవైనా నాలుగు ద్విత్వాక్షరపదాలు రాయండి.

ట్టు

క్కి

డ్డు

చ్చ

వ్వ

న్న

గ్గు

(i) ______________________ (ii) ______________________ (iii) ______________________ (iv) ______________________

19. ఈ కింది ప్రశ్నను చదివి సొంతంగా ఒక నాలుగు వాక్యాలు రాయండి. బారిష్టర్ పార్వతీశంలా నీవుచదువుకోవడం కొరకు విదేశాలకు వెళ్లవలసివస్తే, నీవు ఏ విధంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటావో ఒక నాలుగు వాక్యాలలో తెలియజేయుము.


సెక్షన్ D

మీ జవాబు పత్రంలో ఈ క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. (1 x 6M = 6M)

20. ఈ క్రింది పద్యానికి భావాన్ని మీ సొంతమాటల్లో రాయండి. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు పరహితమ్ము కంటే పరమార్థమున్నదా! లలిత సుగుణ జాల తెలుగు బాల!

 

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages