Type Here to Get Search Results !

Class: 4 Telugu Self Assessment Model Paper - 2 (FA 2) (2025-26)

Exam Code: 424

Class: 4  Telugu  Self Assessment Model Paper - 2  (2025-26)

 

సెక్షన్ - A : బహుళైచ్ఛిక ప్రశ్నలు

ప్రతి ప్రశ్నకి నాలుగు ఎంపికలు ఉంటాయి మరియు ఆ ఎంపికలలో ఒక ఎంపిక మాత్రమే సరైన సమాధానమవుతుంది.

1. కింది వాక్యంలో గీతగీసిన పదానికి అర్థం గుర్తించండి.

పొరుగువారికి తోడుపడు అని అమ్మ చెప్పింది.

·         A) విసిగించు

·         B) సహాయపడు

·         C) నిజం చెప్పు

·         D) కష్టపడు

2. కింది వాక్యంలో గీతగీసిన పదానికి అర్థం గుర్తించండి.

సంక్రాంతి సెలవుల కోసం పిల్లలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

·         A) అదేపనిగా

·         B) ఇష్టంగా

·         C) బాధగా

·         D) నిరుత్సాహంగా

3. కింది వాక్యంలో గీతగీసిన పదానికి బహువచనం గుర్తించండి.

జాతీయజెండాకు వందనం చేయాలి.

·         A) వంద

·         B) వందనం

·         C) వందనాలు

·         D) నివాళులు

4. కింది వాక్యంలో అనుకరణ శబ్దాలను వేరుచేయండి.

గలగల పారే సెలయేరు, గణగణ మ్రోగే బడి గంట నాకు చాలా ఇష్టం.

·         A) సెలయేరు, పారే

·         B) బడి గంట, మ్రోగే

·         C) గలగల, గణగణ

·         D) ఇష్టం, నాకు

5. కింది వాటిలో వేరుగా ఉన్న పదాన్ని గుర్తించి రాయండి.

·         A) దోమ

·         B) పిల్లి

·         C) కుక్క

·         D) (ఖాళీ)

6. కింది వాక్యంలో సంయుక్తాక్షర పదాన్ని గుర్తించండి.

ఆలస్యంగా వచ్చినప్పటికీ అన్నీ తెలుసుకున్నాను.

·         A) అన్నీ

·         B) ఆలస్యం

·         C) తెలుసుకున్నాను

·         D) వచ్చినప్పటికీ

7. కింది వాక్యంలో గీతగీసిన పదం పేరును తెలుపుతుంది కనుక ఏ భాషాభాగానికి చెందుతుందో గుర్తించండి.

సింహాన్ని నేను దగ్గర నుండి చూశాను.

·         A) సర్వనామం

·         B) క్రియ

·         C) నామవాచకం

·         D) విశేషణం

8. కింది వాక్యంలో గీతగీసిన పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి.

సీతకు బొమ్మలు గీయడమంటే ఇష్టం.

·         A) సరదా

·         B) చిరాకు

·         C) ఆసక్తి

·         D) అయిష్టం

9. కింది వాక్యంలో క్రియా పదాన్ని గుర్తించండి.

సుఖదుఃఖాలలో అందరూ కలిసికట్టుగా నడవాలి.

·         A) సుఖం

·         B) అందరూ

·         C) (ఖాళీ)

·         D) నడవాలి

10. కింది వాటిలో ప్రశ్నార్థక పదాన్ని గుర్తించండి.

·         A) ఎందుకు

·         B) వచ్చారు

·         C) అవసరం

·         D) దేశభక్తి


పఠనావగాహన (గద్యం)

కింద అపరిచిత గద్యాన్ని చదివి, అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించండి.

మనదేశం భారతదేశం. మనందరికీ దేశం మీద ఎంతో ప్రేమ, గౌరవం ఉండాలి. దేశాన్ని రక్షించడం మన బాధ్యత. దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించడం, సేవ చేయడం. దేశాన్ని శుభ్రంగా ఉంచడం, జాతీయ పతాకాన్ని గౌరవించడం, జాతీయ గీతాన్ని గౌరవించడం. దేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. సమాజంలో జరుగుతున్న అనేక కార్యకలాపాలకు మనమే కారకులం. మన ఆలోచనలు, ప్రవర్తన, చేసే ప్రతిపని గొప్పగా అందరికీ నచ్చేలా ఉండాలి. దేశాభివృద్ధికి ఆటంకం కల్గించే పనులు చేయరాదు. నిజాయితి, సచ్చీలత ఆయుధాలుగా జీవన ప్రయాణం సాగాలి. అప్పుడే మనం దేశభక్తులుగా పేరొందుతాము.

11. దేశభక్తి అంటే ఏమిటి?

·         A) దేశాన్ని ప్రేమించడం

·         B) ఆటలు ఆడడం

·         C) విదేశాలకు వెళ్లడం

·         D) టీవి చూడడం

12. మనదేశం పేరు ఏమిటి?

·         A) ఆఫ్రికా

·         B) భారతదేశం

·         C) ఆస్ట్రేలియా

·         D) అమెరికా

13. దేశాన్ని అభివృద్ధి చేయడానికి మనం ఏమి చేయాలి?

·         A) కృషి చేయాలి

·         B) అల్లర్లు చేయాలి

·         C) చెత్త వేయాలి

·         D) నిద్రపోవాలి

14. జాతీయ పతాకాన్ని గౌరవించడం దేనికి ఉదాహరణ?

·         A) దేశభక్తికి

·         B) ఆటలకు

·         C) పండుగలకు

·         D) పాఠశాలకు

15. మనం ఎలా ఉండాలి?

·         A) నిర్లక్ష్యంగా

·         B) అల్లరి పిల్లలుగా

·         C) మంచి పౌరులుగా

·         D) అలసత్వంగా


సెక్షన్ - B

మీ సమాధానపు పుస్తకంలో కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. $2\times2=4$

16. కింది ప్రశ్నలకు ఒకటి లేదా రెండు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

(కింది ప్రశ్నార్థక పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి.)

అ) ఎవరు?

ఆ) ఎప్పుడు?

17. గేయంలో ప్రాస పదాలను గుర్తించి రాయండి.

దేశమును ప్రేమించుమన్నా

మంచి అన్నది పెంచుమన్నా

ఒట్టిమాటలు కట్టి పెట్టోయ్

గట్టిమేల్ తల పెట్టవోయి.

·         ప్రాసపదాలు: ______________________


సెక్షన్ - C

మీ సమాధానపు పుస్తకంలో కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. $4\times4=16$

18. కింది పదాలను చదవండి. గేయం ఆధారంగా వాటిని జతపరిచి వాక్యాలుగా రాయండి.

పదం 1

జవాబు

పదం 2

తిండి కలిగితె

[ ]

నాకుకద్దని

ఒట్టి మాటలు

[ ]

కండకలదోయ్

దేశాభిమానం

[ ]

తోడుపడవోయ్

పొరుగు వారికి

[ ]

పట్టుకొని

చెట్టపట్టాల్

[ ]

కట్టిపెట్టోయ్

·         ఉదా: తిండికలిగితె - కండకలదోయ్

19. 'పరివర్తన' పాఠంలో అనుకరణ పదాలు తెలుసుకున్నారు కదా! అలాంటి మరికొన్ని అనుకరణ పదాలను రాయండి.

·         ఉదా: గలగల.

·        
·        

20. ఖాళీలలో సరైన పదాన్ని ఉంచి కథను ఊహించి రాయండి.

ఒక రోజు కాకికి ____________ ముక్క దొరికింది. అది నక్కచూసి, ఆ ముక్కను ____________ అనుకుంది. కాకిని బాగా ____________ కాకి పొంగిపోయి కావ్కావ్ అన్నది. కాకి నోటిలో ____________ ముక్క ____________ నక్క మాంసపు ముక్క తీసుకుని చక్కాపోయింది.

21. కాలాన్ని ఎందుకు వృధా చేయకూడదో చెప్తూ నాలుగు వాక్యాలు రాయండి.

 


Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages