చదివేటపుడు నిద్ర రావడమనేది మనము ఏ భంగిమలో ఉన్నాము ... ఎంతసేపు ఉన్నాము అనే దానిమీద
ఆధారపడి ఉంటుంది . చదివేటప్పుడు శరీర కదలికలు తక్కువగా ఉండటం వలన కండరాలకు ప్రవహించే
రక్తము తగ్గుతుంది . దాని ములాన కండరాలలోని జీవకణాలలో దహనచర్య (combustion) మందగించి " లాక్టిక్ యాసిడ్ " అనే ఆమ్లము తయారవుతుంది
. ఈ ఆమ్లము ప్రాణవాయువైన ఆక్షిజన్ ను అతిగా గ్రహిస్తుంది. దాంతో దేహములోని రక్తానికి
కావలసిన ఆక్షిజన్ లో కొంత తగ్గుదల వస్తుంది . ఆక్షిజన్ తగినంతగా లేని రక్తం మెదడులోకి
ప్రవహించడం వల్ల మగతగా , నిద్ర వస్తున్నట్లుగా
ఉంటుంది . అందుకే చదివేటపుడు ఒకే భంగిమలో ఉండిపోకుండా అప్పుడప్పుడు అటు ఇటూ కదలడం , ఏకుబికిన చదవకుండా మధ్యలో కాస్త విరామము ఇవ్వడం చేస్తే నిద్ర
రాదు.